Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Medical check ups for Mudragada

By   /  June 16, 2016  /  Comments Off on Medical check ups for Mudragada

    Print       Email

mudragadaముద్ర‌గ‌డ‌కు వైద్య‌ప‌రీక్ష‌లు

 

InCorpTaxAct
Suvidha

 

 

కాపుల‌ను బీసీల్లో చేర్చాల‌నే డిమాండ్‌పై ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తున్న కాపు నాయ‌కుడు, ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంకు ఎట్ట‌కేల‌కు డాక్ట‌ర్లు వైద్య ప‌రీక్ష‌లు చేశారు. నిన్న‌టి వ‌ర‌కు వైద్య ప‌రీక్ష‌లకు కూడా స‌సేమిరా అన్న ముద్ర‌గ‌డ నిన్న ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. అయితే విశాఖ జిల్లా క‌లెక్ట‌ర్‌, డీఐజీ లు దీక్ష విర‌మించాల‌ని ముద్ర‌గ‌డ‌ను ప‌దే ప‌దే కోరినా ఆయ‌న ఇంకా దీక్ష విర‌మించ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు అరెస్ట్ చేసిన కాపులంద‌రినీ  విడుద‌ల చేస్తే తాను దీక్ష విర‌మిస్తాన‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. కాగా ముద్ర‌గ‌డ దీక్ష విర‌మించార‌ని, ఆయ‌న సెలైన్ ఎక్కిస్తున్నార‌ని వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేదంటున్నారు ముద్ర‌కొడుకు బాలు. దీక్ష విరమిం చాలని తన తండ్రిని ప్ర‌భుత్వ పెద్ద‌లు సంప్ర‌దించార‌ని,  డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని దీక్ష విరమించాలని పదేపేద కలెక్టర్, విశాఖ రేంజ్ డీఐజీ కోరినా తన తండ్రి అంగీకరించలేదని.. జేఏసీ ఆందోళన చేయడం వల్లే పరీక్షల కోసం రక్తనమూనా ఇచ్చారని బాలు పేర్కొన్నారు.

కాగా ముద్రగడ పద్మనాభం వైద్యానికి అంగీకరించారని బీజేపీ నేత ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తెలిపారు. వైద్యులు ముద్రగడ రక్త శాంపిల్స్ సేకరిస్తున్నారని.. ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారని ఆయన చెప్పారు. కాపు జేఏసీ నేతల సమక్షంలో తనతోపాటు, పోలీస్, ప్రభుత్వ అధికారులు చర్చలు జరిపారని ఆయన తెలిపారు. ముద్రగడ డిమాండ్‌లను తీర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. అయితే అక్క‌డి మీడియాను కానీ, పార్టీల నాయ‌కుల‌ను కానీ ఎవ‌రినీ అనుమ‌తించ‌క‌పోవ‌డంతో అక్క‌డ ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ తెలియ‌డం లేదు. దీంతో రోజుకో పుకారు వ‌స్తోంది. ఏది ఏమైనా వైద్య ప‌రీక్ష‌ల‌కు ముద్ర‌గ‌డ ఒప్పుకున్నార‌ని ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌, దీక్ష చేస్తున్నార‌ని ముద్ర‌గ‌డ కొడుకు బాలు చెప్ప‌డం విశేషం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →