Loading...
You are here:  Home  >  Specials  >  Current Article

Meeku Telugochha?

By   /  September 4, 2014  /  No Comments

    Print       Email

“మీకు తెలుగొచ్హా?” అమయకంగా అడిగింది అందమైన

అమ్మాయి

InCorpTaxAct
Suvidha

 

ఆఫీసెగ్గొట్టి సిల్క్ స్మిత సినిమాకెల్లినప్పుడు కరెంటు పోయినట్టు

ఉల్లిక్కిపడ్డాను. ఒక్కసారి మతి పోయినట్టనిపించి

ఆ మరుక్షణమే మతి ఉండిన వారికే పొవును అనె సూక్తము

విస్మరించి, నా మీద నాకే చెప్పొద్దు, బోల్డంత గర్వము, కూసింట జాలి వర్షించాయి

 

“ఓస్”, “ఆఫ్ట్రాల్ తెలుగొచ్హా” అనె జెనెరల్ నాలెడ్జి ప్రశ్న కి

మరీ EAMCET లొ కాపి కొట్టలెక పొయినన్త బిల్డప్పా అని మేరు

దీర్ఘం తీస్తే టొమాటొ పప్పులొ కాలేసినవరే సుమీ! ఆడవారి

ప్రతి మాట వెనుక, వాక్యపు ముందర “Context” అనేది ఉండి

ఏడుస్తుంది. ఆ “Context” కంట పడనిచొ ఆ సందేశం “Text” మెస్సేజి తాహతును మించలెదని సవినయపు మనవి

 

“తెలుగొచ్హా” అన్న ప్రశ్న, పలకరింపుగా అడిగిన ప్రీతి సంభాషణ కాదు. నెను 45 నిమిషాలు నా గురించి, నా అశయాల గురించి..వాటికి ఓపిరి పొసే నా అశల గురించి , చందస్సుతొ మరీ వర్ణించిన పిదప వెల్లువడిన నిస్సంకోచ సంశయము

 

“భలే తమ్ముడు” సినిమాలొ అన్నయ పాత్ర దొరికినంత దిగులు నిస్ప్రుహ కలిగాయి

 

కాని ఎందుకు నా మీద ఈ అనుమానపు జల్లు..why I say? అచ్హ తెలుగులొ మాట్లాడానా లేదే; పొని అచ్హు తెలుగు హెరొలా ఉన్నానా కాదే. మరి ఈ సుందర వదనము నుండి ఈ పదునైన పదములేల?

 

ఈ ఊహలు ఉప్పొంగి, ఉప్పెనలా మారి ఉద్వేగముతొ నేను ఊగిపొతుంటే, ఆ అమయకపు కళ్ళలొ అనుమానం కనిపించి, నా మానం కాపాడుటయే తక్షణ కర్తవ్యముగా భావించి, ఒక్క సారిగ నోరు విప్పి బిగ్గరగా నవ్వేసాను (తెలుగులొ)

 

ఇప్పుడు తెల్లబొవడం ఆమె వంతయ్యింది. “హమ్మయ్య, భలె చన్సు లే” అని మనసులొ ఆది తాలముతొ పాడుకుని, “నీకు చూసి నాకు అరబ్బి అమ్మయి అని అనిపించి, ఉర్దులొ ఉరికి ఉరికి ఉసిరా..గట్ల కాదంటే సక్కగా పత్లి గల్లి నుండి నికల్తా” అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా పలాయనం చిత్తగించా

 

“మీకు ఉర్దూ వచ్చా” అని మాత్రం అడగొద్దు

 

Hari

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email
  • Published: 6 years ago on September 4, 2014
  • By:
  • Last Modified: September 4, 2014 @ 6:39 am
  • Filed Under: Specials

Leave a Reply

You might also like...

Sankara Netharalaya music concert by Rahul Vellal

Read More →