దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సాహితి ప్రియులకు ఇదే మా ఆహ్వానం. ఒక సాయంకాలం “జొన్నవిత్తుల” గారి తో మాటా మంతి. అందరు ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం.
Venue: Ashtalakshmi Temple
8130 Laurel Canyon Blvd, North Hollywood, CA 91605
http://
వికటకవి – విలక్షణ కవి – వినూత్న కవి
సరసులు – సరస్వతీ పుతృలు – శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావుగారు.
కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ — కాదేదీ కవితకు అనర్హం అన్నాడు మహాకవి శ్రీ శ్రీ. అది దృష్టిలో పెట్టుకుని ఎన్నో వినూత్నమైన ప్రయోగాలతో రచనలు చేసిన వారు శ్రీ జొన్నవిత్తుల.
తిట్ల తో దండకం, కాఫీ మీద దండకం, అలా వెరైటీ రచనలే కాకుండా, తెలుగు తల్లికి గర్వకారణమనిపించే తెలుగమ్మ శతక కర్త శ్రీ జొన్నవిత్తుల. అది కాక ఎన్నో సినిమాలకు ఎన్నదగ్గ పాటలు రాసారు ఈయన. వారితో ఒక రెండు గంటలు సాహితీ కాలక్షేపం – సాహిత్యప్రియులకు విందు వంటిదే కదా..
ఈ నెల 21వ తేదీ సాయంత్రం, జొన్నవిత్తుల వారితో సాహితీ కాలక్షేపానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం (Telugu Association of Southern California – TASC) ఈ సంవత్సరం సంకల్పించిన ధ్యేయాలలో – కనీసం సాహితీ సదస్సు ఒకటి ఏర్పాటు చేసి సాహితీ ప్రియులను ఉత్సాహపరచాలని.
అందుకోసం అందిస్తున్నాం ఈ కార్యక్రమం మీ కోసం – తప్పక వస్తారు కదూ!!! మరో విషయం – ప్రవేశం ఉచితం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.