Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Meet the ‘Judwaa 2’ trio: David Dhawan, Varun Dhawan and Sajid Nadiadwala

By   /  February 9, 2016  /  Comments Off on Meet the ‘Judwaa 2’ trio: David Dhawan, Varun Dhawan and Sajid Nadiadwala

    Print       Email

David Dhawan- Varun Dhawan

వరుణ్ ధావన్ హీరోగా జుడ్వా-2

InCorpTaxAct
Suvidha

కండల వీరుడు సల్మాన్ ఖాన్ డ్యూయల్ రోల్ చేసిన మూవీ జుడ్వా. ఈ మూవీలో ఆయన సరసన కరిష్మా కపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అప్పట్లో సంచలన విజయం నమోదుచేసింది. ప్రస్తుతం ఈ మూవీకి బాలీవుడ్ లో సీక్వెల్ రాబోతోంది. అయితే ఇందులో హీరోగా వరుణ్ ధావన్ కనిపించనున్నారు. జూడ్వా2 పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా వరుణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.

వరుణ్ ద్విపాత్రాభినయం చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సినిమాని స్వయంగా ఆయన తండ్రి డేవిడ్ ధావన్ డైరెక్ట్ చేయనున్నారు. ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో ఏ అందాల తార ఛాన్స్ కొట్టేసింది అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. త్వరలో హీరోయిన్ ను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. మరి ఈ తండ్రి తనయుల కాంబినేషన్ కి తగ్గ హీరోయిన్ గా ఎవరు ఛాన్స్ దక్కించుకుంటారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ట్రయల్ రన్ షూట్ నిర్వహిస్తున్నారు. మూవీలో భారీయాక్షన్ సన్నివేశాలతో పాటు స్కై డైవింగ్ లాంటి సాహస కృత్యాలను చిత్రీకరించ నున్నారని తెలుస్తోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →