Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Mega fans war on social media..?

By   /  August 14, 2016  /  Comments Off on Mega fans war on social media..?

    Print       Email

sai dharam tej 1సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ సెటైర్లు..!

 

InCorpTaxAct
Suvidha

 

 

సోషల్ మీడియా పేరుచెప్పి ప్రతీ అంశానికి విపరీతమైన ప్రచారం జరుగుతోంది. చిన్న చిన్న విషయాలపై కూడా రాద్ధాంతం జరుగుతోంది. తాజాగా ఈ సోషల్ మీడియానే మెగా హీరోలు అల్లు అర్జున్ – సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ మధ్య వార్ కి వేదిక అయింది. ‘సరైనోడు’ సినిమా వేడుకలో అల్లు అర్జున్ స్పీచ్ సందర్భంగా పవర్ స్టార్ అభిమానులు నినాదాలు చేశారు. దీంతో బన్నీ పవన్ కల్యాణ్ గురించి ‘చెప్పను బ్రదర్’ అన్నాడు. దీంతో ఆ సమయంలో విమర్శలు వెల్లువెత్తాయి. బన్నీ క్లారిటీ ఇవ్వడంతో అంతా సద్దుమణిగింది.
అయితే సాయిధరమ్ తేజ్ ‘తిక్క’సినిమా వేడుకలో పవర్ స్టార్ అభిమానులు కేకలు విని వారిని మరింత ఉత్సాహ పరిచాడు. ‘చెబుతాను బ్రదర్’అంటూ మళ్ళీ వివాదాన్ని కదిపాడు.దీంతో బన్సీ ఫ్యాన్స్ సాయిధరమ్ తేజ్ పై కోల్డ్ వార్ ప్రకటించారు. సోషల్ మీడియాలో ఈ పదాలనే హ్యాష్ ట్యాగ్ లుగా పెట్టుకుని ఓ హీరో ఫ్యాన్స్ మరో హీరో ఫ్యాన్స్ పై సెటైర్లు వేసుకుంటున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ‘తిక్క’ సినిమాకు డివైడ్ టాక్ రావడంతో.. ‘తిక్క కుదిరింది బ్రదర్’ అని హ్యాష్ ట్యాగ్ పెట్టి సెటైర్లు వేస్తున్నారు. అయితే మెగా హీరోలు ఎంత వివరణ ఇచ్చుకున్నా ఫ్యాన్స్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →