Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Mehbooba Mufti – The First Lady of Jammu And Kashmir

By   /  March 25, 2016  /  Comments Off on Mehbooba Mufti – The First Lady of Jammu And Kashmir

    Print       Email

mehabooba mufthi 1

ప్రభుత్వ ఏర్పాటుకు మెహబూబా సిద్ధం..

InCorpTaxAct
Suvidha

 

గత రెండు నెలలకు పైగా జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన సాగుతున్న విషయం తెలిసిందే. అయితే పీడీపీ చీఫ్ మెహబూబా.. ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. గురువారం శ్రీనగర్‌లో జరిగిన పీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర సీనియర్‌ నేతల భేటీలో పార్టీ శాసనసభాపక్ష నాయకురాలిగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెహబూబా ముఫ్తీ ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు. దీంతో, జమ్మూకశ్మీర్‌ తొలి మహిళా సీఎంగా ఆమె బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు.

మెహబూబా తండ్రి ముఫ్తీ మహమ్మద్‌ సయీద్‌ గత జనవరి 7న మరణించారు. అయితే ఆ సమయంలోనే సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి మెహబూబాకు అవకాశం వచ్చింది. అయినా ఆమె అందుకు నిరాకరించారు. దీంతో గవర్నర్ రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించారు. తర్వాత మెహబూబా బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు రకరకాల కండీషన్లు పెడుతూ వచ్చారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మెహబూబా ప్రధాని మోదీతో కలిసి పలు అంశాలపై చర్చించారు. తర్వాత తమ భేటీలో మోదీ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.

ఇక జమ్మూ కశ్మీర్ లో రాజకీయ పరిణామాలపై చర్చించి, పార్టీ నేతల అభిప్రాయం తీసుకోవడానికి బీజేపీ నేతలు రామ్‌ మాధవ్‌, జితేంద్ర సింగ్‌ శుక్రవారం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. అయితే పీడీపీకి బీజేపీ మద్దతు ఇవ్వడం మాత్రం లాంఛనప్రాయమే. అనంతరం బీజేపీ, పీడీపీ నేతలు గవర్నర్‌ను కలిసి రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై తమ అభిప్రాయాలు వెల్లడించనున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →