Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Mexicans burn Donald Trump effigies in Easter ritual

By   /  March 27, 2016  /  Comments Off on Mexicans burn Donald Trump effigies in Easter ritual

    Print       Email

Mexicans burn Donald Trump effigies

ఈస్టర్ సందర్భంగా ట్రంప్ దిష్టిబొమ్మలు తగులబెట్టిన మెక్సికన్లు..
ఈస్టర్‌ సంప్రదాయంలో భాగంగా మెక్సికన్లు శనివారం రాత్రి అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ దిష్టిబొమ్మలను తగలబెట్టారు. ట్రంప్‌ దేశాధ్యక్ష పదవికి అభ్యర్థిగా బరిలో దిగింది మొదలు మెక్సికన్లపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. మెక్సికో నుంచి మాదకద్రవ్యాల స్మగ్లర్లు, రేపిస్టులు అమెరికా వస్తున్నారని ట్రంప్‌ తన ప్రచారంలో చాలాసార్లు విమర్శలు గుప్పించారు. వారిని రాకుండా నియంత్రించడానికి సరిహద్దులో పేద్ద.. గోడ కట్టేయాలని కూడా ఆయన అన్నారు. ట్రంప్‌ ధోరణితో సరిహద్దు ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది.

InCorpTaxAct
Suvidha

ఈ నేపథ్యంలో ఈస్టర్‌ రావడంతో మెక్సికో అంతటా పలు చోట్ల ట్రంప్‌ దిష్టిబొమ్మను తగలబెట్టారని సమాచారం. అంతేకాకుండా పెద్ద పెద్ద బొమ్మలు అగ్నికి ఆహుతవుతుండగా ‘చావు’ అంటూ ప్రజలు కేకలు వేశారని అక్కడి మీడియా పేర్కొంది. సాధారణంగా ఈస్టర్‌ సందర్భంగా బైబిల్‌ ప్రకారం జీసెస్‌ని మోసం చేసిన జుడాస్‌ ఇస్కారియట్‌ బొమ్మలను తగలబెట్టడం మెక్సికోలో ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించిన రాజకీయ నాయకుల బొమ్మలకూ కొన్ని సమయాల్లో ఇలాంటి గతి పడుతూంటుంది. అలా ఈసారి రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌ వంతు వచ్చినట్లుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →