అదే జరిగితే తమదైన శైలిలో స్పందిస్తాం: మెక్సికో మంత్రి లూయిస్ విడ్ గర్రే
అమెరికా – మెక్సికో సరిహద్దులో గోడ కడతానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్న విషయం తెలిసిందే. దీని నిధుల కోసం మెక్సికోకు అమెరికా చేసే ఎక్స్ పోర్ట్స్ పై ప్రత్యేక పన్నులు వేస్తామని అనడాన్ని ఆ దేశం చాలా తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి పనులు చేయడం మొదలుపెడితే తమదైన శైలిలో రియాక్షన్ ఉంటుందని ఆ దేశం తేల్చి చెప్పింది. మెక్సికో విదేశాంగ శాఖ మంత్రి లూయిస్ విడ్ గర్రే ఈ విషయంపై మాట్లాడారు. మెక్సికోకు ఉత్పత్తి చేసే అమెరికా ఎక్స్ పోర్ట్స్ పై ప్రత్యేకమైన ట్యాక్స్ లు వేయనున్నట్లుగా ఆయన తెలిపారు. దీనిపై తమ విధానం ప్రత్యేకంగా ఉండబోతోందన్నారు. వాస్తవానికి మెక్సికో స్వేచ్ఛా వాణిజ్యాన్ని నమ్ముతోందని ఓ రేడియోకి ఇంటర్వ్యూలో భాగంగా చెప్పారు.
ఇక గోడ నిర్మాణం త్వరలో ప్రారంభిస్తామని ట్రంప్ చెప్పారు. అలాగే ఆ దేశ అధికారులు త్వరితగతిన పనులు ప్రారంభిస్తున్నారు. వచ్చే నెలలో గోడకు సంబంధించిన డిజైన్ పూర్తి అవుతుంది. ఇక మార్చి6 నాటికల్లా డిజైన్ సమర్పించాలని బోర్డన్ ప్రొటక్సన్ ఫోర్స్ తెలియజేసింది. మార్చి 20 కల్లా కొన్ని డిజైన్లను ఎంపిక చేస్తారని సమాచారం.ఇక అనుకున్న గడవు కంటే ముందే గోడ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని డోనాల్డ్ ట్రంప్ అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.