ఆ.. వాటిర్ వాటిర్…
ట్రెయిన్ జర్నీలో ఆ మాట వినగానే ప్రాణం లేచివస్తుంది.
దాహంతో ఉన్నారు ఏం చేస్తారు? వాటర్ బాటిల్ కొనేస్తారు…
ఈలోగా ఎవరో కాల్ చేశారు. ఏం చేస్తున్నారని అడిగారు కాజువల్ గా…
ఆరోగ్యం పాడవకూడదని మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కుని నీళ్లు తాగుతున్నానని చెబుతారు?
ఇక్కడ కట్ చేస్తే…
ఆ నీళ్లు రెండు రకాలు…
మినరల్ వాటర్, పాకేజ్ డ్ డ్రింకింగ్ వాటర్…
రెండింటిలో బ్రహ్మాండమైన తేడా ఉంది…
అదెలాగంటే భూగర్భంలో సహజంగా లభించే నీటిని యధాతదంగా తీసి ప్యాక్ చేయబడితే మినరల్ వాటర్ అని అర్థం..ప్రభుత్వం మినరల్ వాటర్ కు ఇచ్చిన నెం IS13428 …
ఏ చోటు లభించే నీటినయినా సరే తీయగా చేస్తారు… యూవీ లేదా ఓజోన్ ట్రీట్ మెంట్ తో క్రిమిరహితంచేసి ప్యాక్ చేస్తారు..దానికి ప్రభుత్వం IS 14543 నెంబర్ కేటాయించింది…
రెండంటిి క్వాలిటీలు వేరు..అలాగే రెంటి ధరలు కూడా వేరుగానే ఉంటాయి…
వ్యాపారులు మాత్రం ఆ తేడాలేమీ లేకుండానే అమ్మేస్తున్నారు…
సో.. ఈసారి వాటర్ బాటిల్ కొంటే లేబుల్ పై ISI నెంబర్ నెంబర్లను గుర్తించండి…
13 నెంబర్ మినరల్ వాటర్ అనీ, 14 నెంబర్ జస్ట్ ప్యాకేజ్ డ్ తాగునీరని గుర్తుంచుకోండి…
చివరగా మరొక్కసారి కట్ చేస్తే…
ఏ నీరు తాగాలో దేనికెంత చెళ్లించాలో మీకిప్పుడు తెలిసిపోయిందిగా?
తరువాతేం చేయాలో మీకు చెప్పాలా?
డబ్బులు చెళ్లించేదే తాగండి అలా డిమాండ్ చేయండి…
మీకా హక్కుంది…
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.