జగన్ ను పక్కన కూర్చోబెట్టుకోవడ తప్పుడు సంకేతాలను ఇస్తుంది: మంత్రి అయ్యన్నపాత్రుడు
ప్రధాని మోదీ అత్యంత ప్రజాదరణ కలిగిన నేత అని ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. మోదీ దేశాభివృద్ధి కోసం గతంలో ఏ ప్రధానీ కష్టపడనంతగా శ్రమిస్తున్నారని అన్నారు. అయితే ఏపీ విపక్ష నేత జగన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వడంపై తప్పుబట్టారు. ఆదివారం ఉదయం ఆయయన విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో జరగబోయే మహానాడు ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
మహా మేధావి అయిన మోదీ నేరగాడు అయిన జగన్ ను పక్కన కూర్చుబెట్టుకోవడం తప్పుడు సంకేతాలను ఇస్తుందని అన్నారు. మంత్రి మాణిక్యాలరావు సహా ఇతర బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని అన్నారు.దీనిపై ఆ పార్టీ నేతలే ఆలోచించుకోవాలని అన్నారు. తాము మరో పదేళ్ళపాటు బీజేపీతో కలిసి నడవాలని భావిస్తున్నామని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.