కేసీఆర్కు షాక్ ఇచ్చిన కేంద్రమంత్రి
తనకు ఎదురే లేదన్నట్లుగా తెలుగు రాష్ర్టాల్లో అందరి నోరు మూయిస్తున్న కేసీఆర్ కు కేంద్రం నుంచి తీవ్ర స్థాయిలో రివర్సు అటాక్ తగిలింది. హైకోర్టు ఏర్పాటు అంశంపై ఢిల్లీలో ధర్నా చేస్తానని బెదిరించిన కేసీఆర్ కు కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ అంతేస్థాయిలో సమాధానమిచ్చారు. అంతేకాదు.. కేసీఆర్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లా వ్యవహరిస్తున్నారని దాని వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదన్న సంగతి ఆయన తెలుసుకోవాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల హైకోర్టు విభజన కేసు పెండింగ్ లో ఉండగా – కేంద్రం ఏమీ చేయలేదన్న సంగతి కేసీఆర్ కు తెలియదా? అని ఆయన ఎద్దేవా చేశారు. ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తానని కేసీఆర్ మాట్లాడటం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని కనీసం పదేళ్ల పాటు హైకోర్టు హైదరాబాద్ లో ఉండటానికి అవకాశాలను విభజన చట్టం కల్పించిందని ఆయన గుర్తు చేశారు.
చంద్రబాబు చొరవతోనే హైకోర్టు వేర్పాటు సాధ్యమన్న సంగతి కేసీఆర్ తెలుసుకోవాలని హితవు పలికారు. వాస్తవాన్ని పక్కనబెట్టి కేజ్రీవాల్ మాదిరిగా – ధర్నాలు – నిరసనలు తెలిపితే తమకేమీ అభ్యంతరం లేదని అయితే శాంతిభద్రతల సమస్యలు తప్ప మరేమీ ప్రయోజనం ఉండబోదని సదానందగౌడ అభిప్రాయపడ్డారు. జంతర్ మంతర్ వద్ద కేసీఆర్ ధర్నా చేయదలచుకుంటే స్వాగతిస్తామని.. అందుకు తగిన విధంగా సమాధానం చెబుతామని సదానంద గౌడ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అంతేకాదు విడిగా హైకోర్టు ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఏపీ సర్కారుదని – ఏపీ ప్రభుత్వం సిద్ధంగా లేనంతవరకూ తామేమీ చేయలేమని ఆయన అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.