Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Ministers are bringing up Vastu in Amaravathi

By   /  August 22, 2016  /  Comments Off on Ministers are bringing up Vastu in Amaravathi

    Print       Email

amaravathiఅక్క‌డ వాస్తుకు పెద్ద‌పీఠ‌!

 

InCorpTaxAct
Suvidha

 

తాత్కాలిక స‌చివాల‌యంలో మంత్రులు వాస్తుకు పెద్ద‌పీఠ వేస్తున్నారు. ఇప్పుడు క‌ట్టిన భ‌వ‌నాలు స‌రిగా లేవంటూ.. వాస్తు ప్ర‌కారం క‌ట్టాలంటూ మార్పులు చేర్పులు చేస్తున్నారు. కాగా తమ చాంబర్లు వాస్తుకు అనుగుణంగా లేవని – అడ్డగోలుగా నిర్మించారని మంత్రులు గంటా శ్రీనివాస రావు – యనమల రామకృష్ణుడు – ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో సిఆర్ డిఏ అధికారులు వాస్తుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. మంత్రుల కోసం నిర్మించిన ఛాంబర్లను సిబ్బంది పగులకొట్టారు. రెండు – ఐదు బ్లాకుల్లో కట్టిన గదులను సమూలంగా తొలగించారు. వాటి స్థానంలో పెద్దపెద్ద గదులు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు రూ.750 కోట్ల వ్యయంతో నిర్మించిన భవనాల్లో గదులను కూల్చడం చర్చనీయాంశమైంది. కొద్దిమంది మంత్రులు కావాలని పెద్దఛాంబర్లు పెట్టుకుని మిగిలిన వారికి చిన్నవి కేటాయించారని గతంలోనే అసంతృప్తులు వ్యక్తమైన సంగతి తెలిసిందే. దీంతో ఐదో బ్లాకులో గతంలో మంత్రి మృణాళిని – అయ్యన్నపాత్రుడికి కేటాయించిన ఛాంబర్లు రెండిటినీ కలిపి మృణాళిని కేటాయించారు.
వెయిటింగ్ హాల్స్ – మరుగుదొడ్లను పగులకొట్టి ఆ స్థానంలో అయ్యన్నపాత్రుడికి ఛాంబర్ కేటాయించారు. యనమల రామకృష్ణుడికి కేటాయించిన ఛాంబర్ లోకి ఎవరూ వెళ్లకుండా తాళాలు వేశారని సమాచారం. ముందస్తు ప్రణాళిక లేక వాస్తు మార్పుల పేరుతో ఇపుడు ధ్వంసం చేయడం కలకలం రేకెత్తిస్తోంది. ఇటు నిధులు వృథా చేయడం – అటు పరిపాలనలో జాప్యం అనే రెండు నష్టాలను భరించాల్సి వస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తాత్కాలిక సచివాలయంలో 9 శాఖలు ప్రారంభించినా స్వాత్రంత్య దినోత్సవం రోజు కూడా అధికారులు – సిబ్బంది పత్తాలేకుండా పోవడానికి తోడు తాజాగా మంత్రుల ఆకాంక్షకు తగినట్లుగా నిర్మాణాలు పగులగొట్టడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →