Loading...
You are here:  Home  >  Deccan Abroad  >  Current Article

Miss World 1994: “మన ఆణిముత్యాలు – 21..సుప్రసిద్ధ నటీమణి ‘ఐశ్వ ర్యా రాయ్’ ”

By   /  October 31, 2016  /  No Comments

    Print       Email

1416487359_aishwarya-rai-bachchan”ఐశ్వర్యా రాయ్” అందానికి నిర్వచనం..పేరుకు తగిన వ్యక్తిత్వం..అద్బుతమైన జ్ఞానం..జన్మతహా పుణికిపుచ్చుకున్న తను బహువిధ ప్రజ్ఞామణి. మన ఆణిముత్యాలలో పేర్కొనదగిన మహిళామణి.

1973 నవంబర్,1న కర్నాటక రాష్ట్రంలో మంగళూరులో తుళు మాట్లాడే కుటుంబంలో జన్మించింది ఈ తారామణి.ఈమె చదువు కోసం కుటుంబం ముంబైకి తరలింది.”ఆర్య విద్యా మందిర్”లో ఉన్నత పాఠశాల చదువు.,”జై హింద్ కాలేజీ” లో తరువాత ”డి జి రూపరెల్” కాలేజీలో ఇంటర్ చదివి 90శాతం మార్కులతో ఉత్తీర్ణురాలైంది.శాస్త్రీయ నృత్యంలో ఐదు సంవత్సరాలపాటు శిక్షణ పొందింది.ఆమెకి జువాలజీ అంటే ఇష్టం.డాక్టర్ కావాలని ఉన్నా మరో వైపు ఆర్కిటెక్ట్ కావాలని చివరకు మోడలింగ్ లోకి ప్రవేశించింది.
చిరునవ్వుల మణిపూస.,మేలిముత్యమంటి స్వచ్చమైన నవ్వు ఆమెకు పెట్టని ఆభరణం.స్త్రీని వ్యాపార వస్తువుగా చూస్తున్న కాలంలో అందానికి తోడు ప్రతిభతో వెలుగొందుతూ నాట్యమాడుతున్న ఒక అపురూప కళారూపం ఐశ్వర్యారాయ్.
”మిస్ ఇండియా” ”మిస్ వరల్డ్ ” లు సాధించినా ఆ కిరీటాలకే ఎనలేని వన్నె కూర్చిన
ఒక మహా విజ్ఞానసౌందర్యరాశి అని చెపితే ఇంకా చాలా రెట్లు తక్కువేనేమో.
ఎన్నో అద్భుతమైన మైలురాళ్ళను సృష్టించిన ఐశ్వర్యకు సాటి మరెవరు.?!
ఫిలిం ఫేర్ అవార్డులు.,పద్మశ్రీ తో పాటు లెక్కకందన్నని అవార్డులు సొంతం చేసుకున్న ఐశ్వర్య ప్రతిభాసామర్థ్యా లు ఎవరు ఎలా తూచగలరు..కొలవగలరు.కాలేజీ రోజులలోనే మోడలింగ్ ప్రాజెక్ట్స్  ఎన్నో చేసింది.1997లో తమిళ్ సుప్రసిద్ధ యాక్టర్ మోహన్ లాల్ తో నటించింది.అదే సంవత్సరం ”ఔర్ ప్యార్ హోగయా” తన మొదటి హిందీ చిత్రం రిలీజ్ అయింది.మరి 1998లో తమిళ్ ”జీన్స్” గొప్ప ప్రేమకథా చిత్రంగా అత్యద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక తెలుగులో అదే జీన్స్ సాధించిన విజయం పొందిన ఆదరణ అమోఘం కదా.!2003లో ”దిల్కా రిస్తా” తన అన్న మరి తల్లిగార్ల సహకారంతో నిర్మించింది. ” హమ్ దిల్ దేచుకే సనమ్”కి ఫిలిం ఫేర్ అవార్డ్ ఆ తరువాత ”దేవదాస్” అలా అలా ”మొహబ్బతెయిన్” ”ధూమ్ – 2 ” ”గుజారీష్” సో సక్సెస్ఫుల్.
మరి ఐశ్వర్య జీవిత గమనం చూస్తే..2007లో అభిషేక్ బచ్చన్ తో వివాహం.ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో ఆమె పాత్ర కొనియాడదగినది.అనాథ సేవా సంస్థలకు కార్యకలాపాలకు వెన్నుదన్నుగా ఉండడమే కాకుండా స్వయంగా పాల్గొనడం ఆమెకు ఇష్టం.ఐశ్వర్య రాయ్ CANNES FILM FEVESTIVAL కు వెళ్ళిన మొట్టమొదటి భారతీయ నటి.విశ్వశాంతి కోసం తానొక దూతగా రాయబారిగా ఉండాలన్నది ఆమె సంకల్పం.
2010తరువాత కొంత బ్రేక్ తిరిగి 2015లో ”జాజ్ బా” తో పునఃప్రవేశం.
image2నిన్నటి అందాల రాశి ఐశ్వర్యా రాయ్ పెళ్ళైనా నటనకు స్వస్తి చెప్పలేదు. కానీ తల్లయ్యాక మాత్రం కూతురైన ఆరాధ్య కోసం తన ఇష్టాన్ని కొన్నాళ్ళు పక్కన పెట్టింది. కొన్నాళ్ళు పాప కోసం సినిమాలకీ, సినీ వాతావరణానికీ దూరంగానే ఉన్న ఐశ్వర్యా రాయ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెండితెర పై మెరవనున్నారు. సంజయ్ గుప్తా దర్శకత్వం లో ఐశ్వర్యా రాయ్ నటించిన కొత్త సినిమా అక్టోబర్ తొమ్మిదిన విడుదల కానుంది.ఇర్ఫాన్ ఖాన్, శబానా అజ్మి, జకీ ష్రాఫ్ లాంటి హేమాహేమీలంతా ఉన్న ఈ సినిమా లో ఐశ్వర్యా రాయ్ నటన అద్బుతంగా ఉండబోతుందంటున్నారు ” జజ్బా ” యూనిట్ సబ్యులు. ఇందులో ఐశ్వర్యా రాయ్ ఇంతకు ముందులా అందాలొలకబోసే టీనేజ్ గర్ల్ లా కాకుండా. ఒక కిడ్నాప్ కి గురైన పాపకి తల్లిగ కనిపించనుంది ఐశ్వర్యా రాయ్.ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ కి విశేష స్పందన లభిస్తోంది. ఏ మాత్రం తేడాలేని ఐశ్వర్యా రాయ్ ని చూసి ఆశ్చర్య పోతున్నారు ఆమె అభిమానులు. ఇప్పటికీ వన్నెతగ్గని ఈ అందాల రాశిని చూసి ఎంతైనా ఒకప్పటి ప్రపంచ సుందరి కదా అలాకాక ఇంకెలా ఉంటుందీ అంటూ తమ అభిమాన నటిని మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే యూ ట్యూబ్ లో ఈ వీడియో 3,155,594 మంది చూడగా 9573 మంది ఇష్టపడ్డారు. ఐతే ఇన్నాళ్ళ తర్వాత వచ్చిన ఐశ్వర్యా రాయ్ తన ఈ సెకెండ్ ఇన్నింగ్స్ లో  ఇక ముందు గ్లామరస్ పాత్రలు చేస్తుందా లేక ఇలా వయసుకు తగ్గ పాత్రల్ని ఎంచుకుంటుందా అన్నది అభిమానులముందున్న ప్రశ్న.
ఏది ఏమైనా మనసులో ఎలా ఉన్నా తనను తాను మరచి నవ్విస్తూ నవ్వుతూ..తుళ్ళుతూ గెంతుతూ..ఏడుస్తూ గుండె తడి పెట్టిస్తూ మళ్ళీ తనదైన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవటం నటుల కర్తవ్యం.తిరిగి సమాజ సేవకు విశ్వశాంతికి పనిచేయడం వారి జీవితంలో భాగం కావాలి.మరి అన్నిరకాలుగా అత్యద్భుతంగా పనిచేస్తున్న మహా నాయిక ఐశ్వర్యా రాయ్ గురించి తెలుసుకోవలసింది ఎంతో ఉంది. ఇది ఆమె సంక్షిప్త జీవన రేఖ మాత్రమే.
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →