Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Mission Bhagiratha

By   /  April 10, 2016  /  Comments Off on Mission Bhagiratha

    Print       Email

kcrమిష‌న్ భ‌గీర‌థ‌కు క‌ష్టాలు

 

InCorpTaxAct
Suvidha

 

 

వేధిస్తున్న నిధుల కొర‌త‌

ఒప్పంద సంస్థ‌లూ నిధుల విడుద‌ల‌లో జాప్యం

అనుకున్నస్థాయిలో ముందుకెళ్ల‌ని వైనం

ఎలాగైనా పూర్తి చేయాల‌ని కేసీఆర్ అధికారుల‌కు ఆదేశం

 

తెలంగాణ ప్ర‌భుత్వం మిష‌న్ భ‌గీర‌థ‌ను చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. వ‌చ్చే మూడేళ్ల‌లో అది పూర్తి చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకుంది. అందులో భాగంగానే మిష‌న్ భ‌గీర‌థ ప్రాజెక్టుకు ఎంత డ‌బ్బు ఖ‌ర్చు అవుతాయ‌నే విష‌యాల‌పై గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్య విభాగం(ఆర్‌డబ్ల్యూఎస్‌)లు అంచనా వేసి దాదాపు రూ.36 వేల కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంద‌ని విష‌యాన్ని స్ప‌ష్టం చేశాయి. ఈ మేరకు పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) సైతం తయారు చేసింది. దీనిని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్‌ కూడా ధ్రువీకరించింది. ప్రాజెక్టును వచ్చే మూడేండ్లల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా ప‌రిస్థితులు అందుకు అనుకూలంగా క‌నిపించ‌డం లేదు. వ‌చ్చే మూడేళ్ల నాటికి ప్రాజెక్టు వ్యయం రూ. 40 వేల కోట్లకు చేరే అవకాశాలు లేకపోలేదని వాటర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఇంజనీర్లు చెబుతున్నారు. దాదాపు 19 కంపెనీలకు టెండర్ల ద్వారా పనులు అప్పగించారు.

ఇందులో ఒకటి, రెండు సంస్థలు ఎక్కువ మొత్తంలో పనులు చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే చాలా సంస్థ‌ల‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నా ఆశించిన ఫ‌లితాలు రావ‌డం లేద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం మ‌ద‌న ప‌డుతోంది. కాగా  2016-17 ఆర్థిక సంవత్సరంలో మరికొన్ని సంస్థల నుంచి రుణాల కోసం చర్చలు జరపాలని నిర్ణయించింది. ప్రభుత్వం ప్రధానంగా భారతీయ జీవిత భీమా సంస్థ(ఎల్‌ఐసీ) నుంచి రుణం పొందాలనే ఆలోచనతో ఉంది. ఇందుకోసం త్వరలో ఉన్నతాధికారులు ముంబయి వెళ్లనున్నారు. అలాగే జైకా, ఎఐఐడీబీ, కోటక్‌ మహీంద్రా, ఎస్‌బీహెచ్‌ బ్యాంకులను సైతం సంప్ర‌దించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇది ఇట్లా ఉంటే మిషన్‌ భగీరథలో జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారిని నియమించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయంలో ఫైనాన్స్‌ వింగ్‌ను ఏర్పాటు చేశారు. గత నెల రోజులుగా మిషన్‌ భగీరథ ఆర్థిక వ్యవహారాలను సంబంధిత జెడీ స్థాయి అధికారి పర్యవేక్షణ చేస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →