Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

MLA Roja demands to remove cases on YS Jagan..

By   /  March 2, 2017  /  Comments Off on MLA Roja demands to remove cases on YS Jagan..

    Print       Email

mla rojaజగన్ పై కేసులు ఎత్తివేయాలి: ఎమ్మెల్యే రోజా డిమాండ్

 

InCorpTaxAct
Suvidha

 

తప్పులు చేసేది టీడీపీ నేతలేనని వైసీసీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. అన్ని తప్పులు చేసి విపక్ష నేత జగన్ ను విమర్శించడం తగదని అన్నారు. జగన్ పై అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆ పార్టీ నేతలు గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు.ఇందులో రోజా పాల్గొన్నారు.

కృష్ణా జిల్లా బస్సు ప్రమాదంలో 11 మంది చనిపోయారని రోజా అన్నారు. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి తమపై ప్రభుత్వం కేసులు పెట్టింస్తోందని వాపోయారు. బస్సు యాజమాన్యాన్ని కేసుల నుంచి తప్పించేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోందన్నారు. దీనికపై తన అనుకూల మీడియాను జగన్ పైకి ఉసికొల్పారని ఆరోపించారు. కలెక్టర్ తో జగన్ పై ఉసిగొల్పిందని విమర్శలు గుప్పించారు. విపక్ష నేతతో ఇంత అవమానకరంగా ప్రవర్తిస్తారా అంటూ మండిపడ్డారు. తప్పు చేసింది టీడీపీ అని నిందమాత్రం జగన్ మీద వేస్తున్నారని.. టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఏపీలో ప్రతిపక్ష నేతలకు విమర్శించే హక్కు కూడా లేదా అంటూ తీవ్రంగా ప్రశ్నించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →