Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Mla Roja fires on Tdp..

By   /  March 25, 2016  /  Comments Off on Mla Roja fires on Tdp..

    Print       Email

roja new

మహిళలను మనుషులుగా గుర్తించండి: ఎమ్మెల్యే రోజా
ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేసినందుకే తనను సస్పెండ్‌ చేశారని ఎమ్మెల్యే రోజా అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. సభలో చాలామంది నినాదాలు చేశారని ఆమె తెలిపారు. కాని తనను మాత్రమే ఎందుకు సస్పెండ్ చేశారని ప్రశ్నించారు. ఈ విషయం గురించే స్పీకర్ తో మాట్లాడేందుకు వెళ్లబోయానని తెలిపారు. అయితే పోలీసులు అడ్డుకుని తనను ఈడ్చుకెళ్ళారని అన్నారు.కేవలం కాల్‌మనీని పక్కదారి పట్టించేందుకే తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు. కాల్‌మనీ వ్యవహారంలో మహిళలు బలైపోతుంటే టీడీపీ మహిళా ఎమ్మెల్యేలకు కనీసం చీమకుట్టినట్టు కూడా లేదని ఆరోపించారు. మహిళలను ఓటర్లుగా కాకుండా సాటి మనుషులుగా చూడాలన్నారు. తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక తన ప్రాణాలు తీయడానికి కుట్ర పన్నారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →