వెంకయ్య సంచలన వ్యాఖ్యలు
దేశంలో ఎక్కడైనా ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి మారితే ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై ఆయన ఘాటుగా స్పందించారు. హైదరాబాద్లో వెంకయ్యకు జరిగిన ఆత్మయ సన్మాన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలు భ్రష్టు పట్టాయని, రాజకీయాలను సమూలంగా మార్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా రాజకీయాల్లో మార్పులు రావాలన్నారు. ప్రస్తుత రాజకీయా నేతల్లో ఓర్పు, సహనం నశించాయనిపేర్కొన్నారు. తాను ఏ ఒక్క పార్టీనో ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావని, దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉందన్నారు. డబ్బు తో ఎన్నికల్లో గెలవడం సిగ్గుచేటన్నారు.
పదవి ఉన్నా… లేకపోయినా పార్టీ కోసం ఎంతో మంది కృషి చేశారని, తనకు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సిద్దాంతాల కోసం పనిచేస్తూ వచ్చానని చెప్పారు. భారతీయ జనతా పార్టీ తనకు తల్లిలాంటిదని, తనను ఎన్నో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిందని అన్నారు. బీజేపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. రాజకీయాల్లో తానెప్పుడూ రాజీపడలేదని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధై ర్యంతో ముందుకెళ్లాలని ఆయన కార్యాకర్తలకు సూచిం చారు. మాజీ ప్రధాని వాజ్పేయి, పార్టీ సీనియర్ నేత అద్వానీ పక్కన కూర్చుంటానని తాను ఎప్పుడూ అనుకో లేదని తెలిపారు. బీజేపీలో కార్యకర్తగా ప్రస్థానం ప్రారం భించిన తాను జాతీయ స్థాయి అధ్యక్షుడిని అవు తానని ఎప్పుడూ వూహించలేదన్నారు. ఎవరైనా క్రమశిక్షణతో కష్టపడి పనిచేస్తే పైకి ఎదుగుతారన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.