Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Modi announced ranks to Chief Ministers, What is Chandra Babu reaction?

By   /  July 15, 2016  /  Comments Off on Modi announced ranks to Chief Ministers, What is Chandra Babu reaction?

    Print       Email

modi-story_647_05011605113816న ఏం జ‌ర‌గ‌బోతోంది?

 

InCorpTaxAct
Suvidha

 

 

దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల ప‌నితీరుపై స‌ర్వే చేయించిన‌ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సీఎంల‌కు ర్యాంకులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ర్యాంకులు ప్ర‌స్తుతం పెనుదుమారం రేపుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకు 13వ ర్యాంకు ప్ర‌క‌టించ‌డంపై అటు ప్ర‌జ‌ల్లోనూ, ఇటు రాజ‌కీయ నేత‌ల్లోనూ ఒక‌టే చ‌ర్చ‌. అంతేకాదు తెలుగుదేశం పార్టీలోనే త‌మ్ముళ్లు చెవులుకొరుక్కుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పెట్టుబ‌డుల కోసం ప్ర‌పంచ దేశాలు తిరుగుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల‌ని బాబు ప్ర‌య‌త్నిస్తుంటే అలాంటి ముఖ్య‌మంత్రికి 13వ ర్యాంకు ఎలా ఇస్తారంటూ టీడీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

సీఎం చంద్ర‌బాబు కూడా మోడీపై గుర్రుగా ఉన్న‌ట్లు స‌మాచారం. బీజేపీకి మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీకి 13వ ర్యాంకు ఇచ్చి టీడీపీకి వ్య‌తిరేక‌మైన టీఆర్ఎస్ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు మొద‌టి ర్యాంకు ఎలా ఇస్తార‌ని బాబు కొంత‌మంది బీజేపీ నేత‌ల ద‌గ్గ‌ర‌ త‌న ఆవేద‌న‌న వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. కాగా ఈ నెల 16వ తేదీన మోడీ రాష్ట్ర ముఖ్య‌మంత్రుల ర్యాంకులు ప్ర‌క‌టించ‌నున్న నేప‌థ్యంలో బాబు ప్ర‌స్తుతానికి ఏమీ మాట్లాడ‌కుండా వేచి చూసే ధోర‌ణిలో ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే ర్యాంకులు ప్ర‌క‌టించిన త‌ర్వాత బాబు స్పందించే అవ‌కాశం లేక‌పోలేదు. ఈ ర్యాంకుల విష‌యంలో మోడీపై బాబు తీవ్ర అస‌హ‌నంలో ఉన్నార‌ని, ర్యాంకులు ప్ర‌క‌టించిన త‌ర్వాత బాబు మోడీపై ఫైర్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు బావిస్తున్నారు.

అంతేకాదు బీజేపీతోక‌లిసి ఉండ‌డం వ‌ల‌న రాష్ట్రానికి పెద్ద‌గా ఒరిగిందేమీ లేక‌పోగా… టీడీపీని, బాబును మోడీ వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నార‌ని ఇలాంటి ప‌రిస్థితుల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీతో క‌లిసి ఉండ‌డం అంత మంచిది కాద‌ని తెలుగు త‌మ్ములు బాబుకు చెబుతున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో బీజేపీ నుంచి బ‌య‌ట ప‌డ‌డానికి బాబు కార‌ణాలు వెతుక్కుంటున్నార‌ని, ఈ నెల 16వ తేదీన ర్యాంకులు ప్ర‌క‌టించిన త‌ర్వాత బాబు ఒక సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌ని టీడీపీ నాయ‌కులే అంటున్నారు. దీంతో ఈ నెల 16న ఏం జ‌ర‌గ‌బోతోంది అని రాష్ట్ర ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌డం గ‌మ‌నార్హం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →