మోడీ వ్యాఖ్యలపై దుమారం
భారతదేశానికి ఆయన ప్రధాని, ఆ స్థానంలో ఉన్న వ్యక్తి హుందాగా ఉండాలి. ఆయన మాట్లాడే ప్రతి మాట ప్రపంచ దేశాలు గమనిస్తూ ఉంటాయి. అలాంటి సందర్భంలో సమయాను సందర్భంగా మాట్లాడుతూ దేశ పరుపు ప్రతిష్టలను పెంచే విధంగా మాట్లాడితే అందరూ హర్షిస్తారు. అంతేకానీ రాజకీయాల కోసం ఏదో ఒకటి మాట్లాడతామంటే మాత్రం దేశ పరుపు పోవడం ఖాయం. అయితే ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఉత్తరప్రదేశ్ అలహాబాద్‌లో పరివర్తన్ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సంచలన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వాలని ప్రజలకు సూచిస్తూ అధికారం ఇచ్చాక ప్రజలకు నష్టం కలిగిస్తే తమను తన్ని తరిమేయాలని పిలుపునిచ్చారు.
ఇంత వరకు బాగానే ఉన్నా మాయావతి, ములాయం తోడు దొంగల్లా వ్యవహరిస్తూ చెరి ఐదేళ్లు పాలిస్తూ రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. మాయావతి, ములాయంల నుంచి ఉత్తరప్రదేశ్‌కు విముక్తి కల్పించి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని స్థానిక ప్రజలకు సూచించారు. ఉత్తరప్రదేశ్‌ను ఐదేళ్లలో అభివృద్ధి బాట పట్టిస్తామని, యూపీ అభివృద్ధి చెందితే భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కాగా స్వార్థ రాజకీయాల కోసం ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వాళ్లు సైతం దొంగలు.. దోచుకోవడం అని వ్యాఖ్యనించడం సబబుగా లేదని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.