మెజార్టీ ఇవ్వండి.. జవాబుదారీగా ఉంటా.. యూపీ ప్రచారంలో మోదీ..
యూపీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. దేశభద్రత కోసమే తాము సర్జికల్ స్ట్రైక్స్ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అయితే సర్జికల్ స్ట్రైక్స్ ని విపక్షాలు రాజకీయం చేశాయని విమర్శించారు. విపక్షాలు జాన్ పూర్ వెళ్ళి అమరవీరుల కుటుంబాలను ప్రశ్నిస్తే సర్జికల్ స్ట్రైక్స్ చేయడం నిజమో కాదో తెలుస్తుందని అన్నారు. మోదీ జాన్ పూర్ లో జరిగిన సభలో పాల్గొన్నారు.
దేశంలో వన్ ర్యాంక్ వన్ పెన్షన్ డిమాండ్ గత 40 ఏళ్లుగా ఉందని అన్నారు. అయినా కూడా ఏ పార్టీ దీనిపై ఏమీ చేయలేదని అన్నారు. అయితే తాము ఓఆర్ఓపీని అమలు చేశామని అన్నారు. త్వరలోనే యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తాయని మోదీ అన్నారు. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ కి ఓటమి తప్పదని అన్నారు. యూపీలో బీజేపీ సత్తా చాటడం ఖాయమని అన్నారు. ఈ నెల 13న ఇక్కడ హోలీ సంబరాలు జరుగుతాయని అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే మొదటి కేబినేట్ భేటీలోనే రైతు రుణమాఫీ గురించి చర్యలు తీసుకుంటామన్నారు.బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఇచ్చేలా ప్రజలు దీవించాలని అన్నారు.బీజేపీకి పూర్తి మెజార్టీ ఇచ్చిన ఐదేళ్ళ తర్వాత అభివృద్ధి విషయంలో తనను ప్రశ్నించవచ్చని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు జవాబుదారీగా ఉంటామని చెప్పారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.