ఉగ్రవాదంపై ఉక్కుపాదం
ఇరాన్‌తో కీలక ఒప్పందాల అనంతరం మోడీ వెల్లడి
‘ఉగ్రవాదం, రాడికలిజం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరం ముప్పును ఎదుర్కొనడంపై సన్నిహితంగా, ఎప్పటికప్పుడు సంప్రదించుకోవాలని మేము అంగీకరించాం’ అని టెహ్రాన్‌లో ఇరాన్ అధ్యక్షుడు హాసన్ రౌహానీతో భేటీ అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించాడు. ఇరాన్లో రెండు రోజుల పర్యటన ముగించుకున్న అనంతరం ప్రధాని మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌తో 12 ఒప్పందాలు కుదుర్చుకున్నామని, దైపాక్షిక సంబంధాల్లో భాగంగా కీలకమైన ఛాబహార్ పోర్టు నిర్మాణానికి భారత్ 500 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం చేస్తుందని మోడీ ప్రకటించారు. అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని మోడీ స్పష్టం చేశారు. ఛాబహార్ పోర్టు భారత్, ఇరాన్ మధ్య సంబంధాలకు ప్రతీకగా నిలుస్తుందని హాసన్ అన్నారు. ఇరాన్ పర్యటన గర్వంగా భావిస్తున్నానని మోడీ చెప్పారు. భారత్ ఇతర దేశాల కోసం నిర్మించనున్న మొదటి పోర్టు ఇదే కావడం గమనార్హం.
ఈ పోర్టు నిర్మాణం పూర్తయితే పాకిస్తాన్‌తో సంబంధం లేకుండా మధ్య ఆసియా దేశాల నుంచి భారత్‌కు సముద్ర మార్గం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ఎగుమతులు, దిగుమతులకు రవాణా సులభతరం కానుంది. పాకిస్తాన్‌కు చెందిన సముద్ర భాగం నుంచి ఎటువంటి రవాణాకు ఆ దేశం అంగీకరించకపోవడంతో ఇప్పటి వరకు మధ్య ఆసియా దేశాలతో భారత్‌కు పెద్దగా వ్యాపార సంబంధాలేవీ లేకుండా పోయాయి. దీంతో భారత్ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అటు వైపు పాకిస్తాన్‌కు గ్వాదర్ పోర్టు నిర్మించి ఇస్తూ వ్యాపారాన్ని విస్తృతం చేసుకుంటున్న చైనాకు కూడా చెక్ పెట్టేసింది. పనిలో పనిగా ఇరాన్‌లోని పోర్టు నుంచి అక్కడి ముఖ్య నగరాల్లో ఒకదానికి 500 కిలో మీటర్ల మేర వేయనున్న రైల్వే మార్గానికి కూడా సాయం చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.