Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Modugula is upset with Chandra Babu Naidu

By   /  August 6, 2016  /  Comments Off on Modugula is upset with Chandra Babu Naidu

    Print       Email

modugulaబాబుపై అలిగిన మోదుగుల

 

InCorpTaxAct
Suvidha

 

 

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి టీడీపీ అధిష్టానంపై అలిగారు. పార్టీలో త‌న‌మాటకు విలువ లేకుండా పోయింద‌ని, త‌న‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదని తెగ ఫీలైపోతున్నారు. మ‌రి అంత‌గా ఆయ‌న అల‌గ‌డానికి కార‌ణం ఏంటంటే… గుంటూరు జిల్లాపెదకూరపాడు నియోజకవర్గం నుంచి రెండుసార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన వెన్నా సాంబశివారెడ్డిపై టీడీపీలో చాలామందికి సానుభూతి ఉంది. మోదుగుల‌కు ఈయ‌న అత్యంత స‌హ‌చ‌రుడు కూడా. దీంతో ఈయ‌న‌ను పార్టీలో త‌న ప‌లుకుబ‌డి ఉప‌యోగించి జిల్లాలో ఒక ప‌ద‌విలో నియ‌మించాల‌ని మోదుగుల భావించారు. ఈ క్ర‌మంలోనే ఆసియాలోనే పెద్ద‌దైన గుంటూరు మిర్చియార్డుకు సాంబ‌శివారెడ్డిని చైర్మ‌న్‌ను చేయాలంటూ.. మోదుగుల పార్టీ అధిష్టానానికి సిఫార్సు చేశారు. అయితే, ఈయ‌న విజ్ఞ‌ప్తిని బుట్ట‌దాఖ‌లు చేసిన అధిష్టానం.. ఈ ప‌ద‌విని మన్నవ సుబ్బారావుకు అప్ప‌గించింది. దీంతో మోదుగుల అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. పార్టీలో నామాట‌కు విలువ లేదంటూ.. త‌న అనుచ‌రుల వ‌ద్ద తీవ్రంగా బాధ‌ప‌డ్డార‌ట‌.

ఇంత‌లో.. మార్కెట్‌ యార్డ్‌ డైరెక్టర్ల పదవుల కోసం పేర్లు ఇవ్వాల్సిందిగా యార్డ్‌ పరిధిలోని ఎమ్మెల్యేలను హైకమాండ్‌ పదేపదే కోరింది. మోదుగుల కూడా మార్కెట్ యార్డు ప‌రిధిలోని ఎమ్మెల్యే అయిన‌ప్ప‌టికీ.. డైరెక్ట‌ర్ల పేరును సిఫార్సు చేయ‌లేదు. దీనికి సంబంధించిన గ‌డువు కూడా గ‌త నెల 30తో తీరిపోయింది. ఈ క్ర‌మంలో మోదుగుల చైర్మ‌న్ విష‌యంలోనే నా మాట‌కు విలువ లేన‌ప్పుడు డైరెక్ట‌ర్ విష‌యంలో మాత్రం నా మాట ఎందుకు అని అలిగి కూర్చున్నార‌ట‌. తాను చెప్పిన అధికారిని సీఐగా కూడా నియమించలేదని నిరసన వ్యక్తం చేశారు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండంటూ అలకబూనార‌ట‌. ఈ విష‌యంలో ఇన్‌చార్జ్ మంత్రి చిన‌రాజ‌ప్ప చెప్పినా మోదుగుల మాత్రం అల‌క వీడ‌లేద‌ని స‌మాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →