Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Mohanlal said ‘sorry’ to Junior NTR fans!

By   /  August 14, 2016  /  Comments Off on Mohanlal said ‘sorry’ to Junior NTR fans!

    Print       Email

janathagarrageఎన్టీఆర్ అభిమానులకు సారీ చెప్పిన మోహన్ లాల్..!

సౌత్ ఇండియాలో టాప్ సూపర్ స్టార్ మోహన్ లాల్. అలాంటి నటుడు దర్శకుడు కొరటాల శివ అడగ్గానే ‘జనతా గ్యారేజ్’ లో ఓ పాత్ర చేసేందుకు అంగీకరించారు. అయితే ఆయన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు సారీ చెప్పారు. ఇంతకీ ఆయన సారీ చెప్పడానికి ఓ కారణం ఉంది. మోహన్ లాల్ ‘జనతా గ్యారేజ్’ ఆడియో వేడుకకు హాజరుకాలేకపోయారు. దీంతో ఆయన సారీ చెబుతూ ఓ మెసేజ్ పంపించారు.

InCorpTaxAct
Suvidha

హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ‘జనతా గ్యారేజ్‌’ ఆడియో విడుదల వేడుక శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సినిమాలో నటించిన నటీ నటులు అందరూ హాజరయ్యారు. కాని సమంత అనారోగ్యం కారణంగా హాజరుకాలేదు. ఇక బీజీ షెడ్యూల్స్ ఉండటం వల్ల మోహన్ లాల్ కూడా హాజరుకాలేదు. దీంతో ఆయన ఎన్టీఆర్ అభిమానులకు సారీ చెబుతూ ఓ బైట్ పంపించారు.

‘ఫంక్షన్‌కు రావడానికి వీలైనంత వరకు ప్రయత్నం చేశాను. కానీ బిజీ షెడ్యూళ్ల వల్ల కుదరలేదు. ఎన్టీయార్‌ అభిమానులందరికీ సారీ. కేరళలో జరిగే ఓనం పండగ సందర్భంగా మా జనతాగ్యారేజ్‌ రిలీజ్ కావడం సంతోషంగా ఉంది. ఎన్టీయార్‌ ఈజ్‌ మై లవబుల్‌ బ్రదర్‌’ అని అందులో చెప్పారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →