Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

‘Mohenjo Daro’ shooting updates..

By   /  August 11, 2016  /  Comments Off on ‘Mohenjo Daro’ shooting updates..

    Print       Email

mohenjo daro 2‘మొహంజదారో’ విశేషాలు..!

 

InCorpTaxAct
Suvidha

 

 

బాలీవుడ్ లో అశుతోష్-హృతిక్ ది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలిసి తీసిన ‘జోధా అక్బర్’ ఓ రేంజ్ లో హిట్ అయింది. దీంతో వీరి కాంబినేషన్ కి మంచి పేరు వచ్చింది. తాజాగా ఈ కలయికలో మరో చారిత్రక నేపథ్యమున్న చిత్రంగా ‘మొహెంజోదారో’ వస్తోంది. రెండు వేల ఏళ్ళకు పూర్వం సింధు నాగరికత కాలంలో జరిగిన ప్రేమకథగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శర్మాన్-చాని అనే ప్రేమజంటగా హృతిక్, పూజా హెగ్డే కనిపించనున్నారు. ఇక వీరి గెటప్ లతో వచ్చిన పోస్టర్లు,ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆశక్తి కలిగిస్తున్నాయి.ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ పాటలకు మంచి స్పందన వచ్చింది.మరోవైపు.. రోజు రోజుకు ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతోంది. శాటిలైట్‌ హక్కులకు రూ.45 కోట్లు, పాటలు, ఇతర హక్కుల రూపంలో రూ.15 కోట్ల మేర ఆదాయం సమకూరింది.mohenjo daro 1

ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలు..

 

* ఈ చిత్రం కోసం మొహెంజొ దారో నగరం సెట్‌ను గుజరాత్‌లోని భుజ్‌లో నిర్మించారు. ఇక్కడి స్థానికులే మొహెంజొ దారో నగర పౌరులుగా కనిపించనున్నారు.
* సినిమాలో హృతిక్‌ పులులతో పోరాడే సన్నివేశం ఉంది. దీని కోసం ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. శిక్షణలో ఉండగా హృతిక్‌ రెండు సార్లు గాయాలబారిన పడ్డాడు.
* ఈ చిత్రంలో హృతిక్‌ ఏడడుగులకు పైగా ఎత్తున్న ఇద్దరు మహాకాయులతో తలపడతాడట. ఆ పాత్రల కోసం సుమారు 300 మందికి ఆడిషన్స్‌ నిర్వహించారు.
* అశుతోష్‌ నిర్మంచిన అన్ని చిత్రాలు మూడు గంటలకు పైగానే నిడివి ఉన్నాయి. కాని ‘మొహెంజొ దారో’ మాత్రం 2 గంటల 30 నిమిషాలు నిడివి ఉంటుంది.
* పూజా హెగ్డేకు బాలీవుడ్‌లో ఇదే తొలి చిత్రం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →