Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

More Video conferences than real work

By   /  May 7, 2016  /  Comments Off on More Video conferences than real work

    Print       Email

chandrababuప‌ని త‌క్కువ‌.. వీడియో కాన్ఫ‌రెన్స్‌లు ఎక్కువ‌

 

InCorpTaxAct
Suvidha

 

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ప్ర‌పంచ ప‌టంలో పెడ‌తానంటూ గొప్ప‌లు చెబుతున్నారే కానీ ప‌ని మాత్రం జ‌ర‌గ‌డం లేదు. త‌మ‌ది హైటెక్ పాల‌న అంటూ చెబుతూ స‌మ‌యాన్ని అంతా వీడియో కాన్ఫ‌రెన్స్‌ల‌కే కేటాయిస్తున్నారే గానీ క్షేత్ర స్థాయికి వెళ్లి అక్క‌డ ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందుల‌ను మాత్రం చూడ‌డం లేదు. దీంతో ఎప్పుడు ప‌డితే అప్పుడు వీడియో కాన్ఫ‌రెన్స్‌లంటూ సీఎం విసిగిస్తున్నార‌ని ఉద్యోగులు బ‌హిరంగంగానే విమ‌ర్శిస్తున్నారు. బాబుది ప‌ని త‌క్కువ.. వీడియో కాన్ఫ‌రెన్స్‌లు ఎక్కువ అంటూ మండిప‌డుతున్నారు. కాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్‌పీ ట‌క్క‌ర్ క‌లెక్ట‌ర్ల‌తో రోజూ మూడు నాలుగు గంట‌లు వీడియో కాన్ఫ‌రెన్స్ అంటూ స‌మ‌యాన్ని వృథా చేయ‌డం మంచిది కాద‌ని సీఎంకు చూచించ‌డంతో ఆయ‌న ట‌క్క‌ర్‌పై సీరియ‌స్ అయిన‌ట్లు స‌మాచారం. నాకు తెలియ‌దా.. మీరు నాకు చెప్పే స్థాయా? అంటూ పైర్ అయ్యార‌ట‌. దీంతో మ‌న‌స్థాపం చెందిన ట‌క్క‌ర్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన 100 రోజులు కాక‌ముందే సెల‌వుపై వెళ్తున్న‌ట్లు తెలుస్తోంది.

ప్రధానంగా ఐఎఎస్ లు – ఐపిఎస్ ల బదిలీల వ్యవహారంపై ఇద్దరి మధ్య సంబంధాలు బెడిసికొట్టినట్టు తెలుస్తోంది. కొంతమంది అధికారులను బదిలీ చేయాలని సీఎస్ సిఫార్సు చేయగా చంద్రబాబు వేచి చూసే ధోరణి అవలంబించడం చాలాసార్లు అందుకు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో టక్కర్ అసంతృప్తికి గురయ్యారని ప్రచారం జరుగుతోంది. అయితే  సీనియర్ అధికారి కావడంతోనూ కాదనలేక టక్కర్ కు పదోన్నతి కల్పించడం జరిగినా అనేక విషయాల్లో సీఎస్ ను విశ్వాసంలోకి తీసుకోవడం లేదనే ప్రచారం జరుగుతోంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం బాబు అధికారుల‌తో కాన్ఫ‌రెన్స్‌లు అంటూ స‌మ‌యాన్ని వృథా చేస్తున్నారంటూ రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం విమ‌ర్శిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →