Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Move to Amaraavati after Pushkaraalu?

By   /  July 26, 2016  /  Comments Off on Move to Amaraavati after Pushkaraalu?

    Print       Email

amaravathiశాఖ‌ల త‌ర‌లింపు మ‌ళ్లీ వాయిదా

 

InCorpTaxAct
Suvidha

 

 

పుష్కరాలకు ముందు ఎవరు కూడా నివాసాలు, కార్యాలయాల తరలింపు, గృహప్రవేశాలు తదితరాలకు ముహూర్తాలు పెట్టుకోరు. అదేసెంటిమెంట్ హైదరాబాద్ నుండి వెలగపూడికి కార్యాలయాల త‌ర‌లింపున‌కు కూడా వ‌ర్తిస్తుంద‌ని ప‌లువురు మంత్రులు  సీఎంతో అన్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతోపాటు పనులు జరుగు తున్న బ్లాకుల్లో విలువైన ఫైళ్ళు, ఫర్నీచర్, కార్యాలయాల సమాచారాన్ని కార్మి కులకు వదలటం మంచిది కాదని కూడా పలువురు ఉన్నతాధికారులు సిఎం తో చెప్పినట్లు తెలిసింది. మంత్రులు, ఉన్నతాధికారుల వాదనతో సిఎం కూడా ఏకీభవించినట్లు సమాచారం. దాంతో ఈనెల 29వ తేదీన వెలగపూడిలో పూజలు నిర్వహించాలనుకున్నా విభాగాధిపతులు మంత్రుల ఆదేశాల కారణం గానే పూజలను పుష్కరాల తర్వాతకు వాయిదా వేసుికున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే అక్క‌డ ప‌నులు ఇంకా పూర్తి కానందున వెలగపూడికి వెళ్ళిన పలు కార్యాలయాల సిబ్బంది గోడకు కొట్టిన బంతి లాగ తిరిగి హైదరాబాద్‌కే చేరుకున్నారు.

ముఖ్యమంత్రి ఆదేశాలను కాదనలేక ఉన్నతాధికారులు వెలగపూడికి చేరుకుంటున్నా అక్కడ పనిచేసే వాతావరణం లేకపోవటంతోనే మళ్ళీ హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. నిర్మాణంలో ఉన్న ఏ బ్లాకులో కూడా పనులు పూర్తి కాలేదన్నది వాస్తవం. కొన్ని శాఖలకు చెందిన సిబ్బంది హైదరాబాద్ నుండి పూర్తి స్ధాయిలో తరలివెళ్ళినా అక్కడ వాటిని ఉపయోగించుకునే వీలు కనబడలేదని వాపోతున్నారు. విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో కొన్ని విభాగాధిపతులు కార్యాలయాలు తీసుకున్నారు. సిబ్బందిని కూడా తరలించారు. అయితే, అవి ఏవీ ఇప్పటికిప్పుడు పని చేయటానికి అనువుగా ఉన్న భవనాలు కావు. విభాగాధిపతులు తీసుకున్న భవనాలన్నీ వాణిజ్య, నివాసాల కోసం నిర్మించిన భవనాలు, భవన సముదాయాలు. అటువంటి భవనాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలంటే సదరు భవనాల్లో కార్యాలయాలకు అనువుగా మళ్ళీ మార్పులు చేర్పులు చేయాలి.

అందుకు సమయం పడుతుందని సదరు భవనాల యాజమాన్యాలు చెప్పాయి. దాంతో యాజమాన్యాలు చెప్పినట్లు వినకతప్పటం లేదు. అందుకని మళ్ళీ వారిలో అత్యధికులు హైదరాబాద్‌కే చేరుకుంటున్నారు. దానికితోడు తరచూ కురుస్తున్న వర్షాలు, ముఖ్యమంత్రి, మంత్రుల లాంటి ప్రముఖుల రోజు వారీ పరిశీలన వల్ల కూడా వెలగపూడి నిర్మాణాల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. వెలగపూడి నిర్మాణాలు ఆగష్టు నెలాఖరుకు గానీ పూర్తికాదని నిర్మాణ సంస్ధలు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయడుకే స్పష్టంగా చెప్పటం గమనార్హం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →