Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

MP Geetha Sensational Comments On TDP Party

By   /  December 7, 2017  /  Comments Off on MP Geetha Sensational Comments On TDP Party

    Print       Email
అరకు ఎంపీ గీత సంచలన నిర్ణయం..!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొరియా టూర్ లో ఉన్న విషయం తెలిసిందే. ఓ వైపు ఏపీ అభివృద్ది కోసం ముఖ్యంగా అమరావతి నిర్మాణం కోసం విదేశీ పెట్టుబడులు రాబట్టెందుకు దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే. ఒకవైపు ఆయన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా విదేశాల్లో పర్యటిస్తున్న ఆయనకు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన అరకు పార్లమెంటు నియోజక వర్గ ఎంపీ కొత్తపల్లి గీత సంచలన నిర్ణయాన్ని తీసుకొని బిగ్ షాకిచ్చారు. గతంలోనే ఎంపీ గీత కులం విషయంలో టీడీపీ నేత సంద్యారాణి ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే.
ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీలో చేరిన దగ్గర నుండి ఒక మహిళకిచ్చే కనీస మర్యాద కూడా ఇవ్వడంలేదు. నేను ఎంపీ అనే విషయాన్నీ కూడా గుర్తించడంలేదు. అందుకే ఇటివల అరకులో జరిగిన ఒక విశిష్ట కార్యక్రమంలో, బిల్ గేట్ వచ్చిన సమయంలో తనకు కనీసం పిలుపు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అరకు నుండి పోటి చేయనని, టీడీపీలో కూడా ఉండబోనని వచ్చే ఏడాది ఆగస్టు నెలలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఇంకా ఏ పార్టీలో చేరాలి అనే విషయం మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని ఆమె తెలిపారు.
Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Congress Leader Ponnala Lakshmaiah Fires On CM KCR

Read More →