Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

MP Siva Prasad comparing Chandra Babu Naidu’s greatness with Dharma Raju

By   /  August 2, 2016  /  Comments Off on MP Siva Prasad comparing Chandra Babu Naidu’s greatness with Dharma Raju

    Print       Email

siva prasadమా బాబు ధ‌ర్మ‌రాజు

 

InCorpTaxAct
Suvidha

 

 

ఏపీ రాష్ట్ర విభజన సమయంలో  చిత్తూరు ఎంపీ శివప్రసాద్ రోజుకో వేషం వేస్తూ.. ఏపీకి జరిగే నష్టాన్ని వివరించే కన్నా.. వినోదాన్నే పంచారన్న పేరుంది. విభజన తర్వాత కేంద్రంతో తమ మిత్రపక్షం అధికారంలో ఉన్నా ప్రత్యేక హోదా కోసం నిరసన చేయాల్సి రావటం ఏమిటంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ అధినేత చంద్రబాబు గొప్పతనాన్ని తెగ కీర్తించిన ఆయన.. ధర్మరాజు లాంటోడని వ్యాఖ్యానించారు. తమ అధినేత తలొగ్గి మాట్లాడుతున్నారంటే అదంతా ఆయనలోని ధర్మరాజు గుణం వల్లనే తప్పించి మరొకటి కాదని.. బాబుకు అలగటమే తెలియదని.. అలాంటి ఆయన అలిగితే బీజేపీకి ఇబ్బందేనంటూ గొప్పలు చెప్పుకున్నారు. చంద్రబాబుకు కోపం కానీ.. ఆవేశం కానీ అంత త్వరగా రాదని వ్యాఖ్యానించారు. బాబు అలిగితే ఏం జ‌రుగుతుందో శివప్రసాద్ కు.. అలాంటి అలుగుళ్లకు ఎలాంటి చెక్ చెప్పాలో మోడీకి బాగా తెలుసన్న విషయం మర్చిపోయినట్లున్నారు. అయితే బాబుకు ఆవేశ‌మే ఉండి ఉంటే ఏపీ ప్రత్యేక హోదా అంశంపై ఏదో ఒకటి ఎప్పుడో తేలిపోయి ఉండేది.

ఇదిలా ఉంటే మొన్న చంద్ర‌బాబు ఆగ్రహంతో అరుణ్ జైట్లీ మీద మూడు నాలుగు సార్లు మండిపడేలా మాట మొదలు పెట్టినా.. ఆయనలోని అతి జాగ్రత్త మాటను పూర్తిగా అనలేక మింగేసేలా చేసిన పరిస్థితి. కాగా తమ ఎంపీలు పార్లమెంటు గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలుపుతారని చెప్పినట్లే.. తెలుగు తమ్ముళ్లు కూడా రాజ్య‌స‌భ‌లో వెల్‌లోకి వెళ్ల‌కుండా వాళ్ల స్థానాల్లో నిల‌బ‌డి నిర‌స‌న తెలిపారు. ఏదిఏమైనా ప్ర‌త్యేక హోదా విష‌యంలో టీడీపీ ఇబ్బంది క‌ర‌ప‌రిస్థితి ఎదుర్కొంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →