Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

MS Dhoni is senior player in the team

By   /  May 24, 2016  /  Comments Off on MS Dhoni is senior player in the team

    Print       Email

Ms-dhoni5టీంలో సీనియ‌ర్ ధోనీనే

 

InCorpTaxAct
Suvidha

 

 

బీసీసీఐ ఎందుకు అలాంటి నిర్ణ‌యం తీసుకుందో తెలియ‌దు కానీ.. చాలా మందిని కొత్త‌వారినే జ‌ట్టులోకి తీసుకుంది. అయితే వన్డే, టి20 సిరీస్‌ల కోసం 16 మంది సభ్యుల జట్టు ప్రకటన కాస్త ఆశ్చర్యపరిచింది. గత ఆస్ట్రేలియా పర్యటననుంచి టి20 ప్రపంచ కప్ వరకు భారత వన్డే, టి20 జట్టులో సభ్యులుగా ఉన్న 17 మందిని  ఈ సిరీస్‌కు పక్కన పెట్టడం విశేషం! సీనియర్లలో ధోని ఒక్కడే ఇప్పుడు జింబాబ్వేకు వెళుతున్నాడు. ఈ టూర్ కోసం ఎంపికైన జట్టులో ధోని ఒక్కడే 275 వన్డేలు, 68 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడాడు. మిగతా 15 మంది కలిపి ఆడిన మ్యాచ్‌లు 83 వన్డేలు, 28 టి20లు మాత్రమే. ఈ జట్టుకు ఎంత అనుభవం ఉందో దీన్ని బట్టే తెలుస్తోంది. ‘మేం ఎవరికీ విశ్రాంతి ఇవ్వలేదు. ఏ ఆటగాడు కూడా తాను అందుబాటులో ఉండనని, తనను ఎంపిక చేయవద్దని కోరలేదు కూడా. జింబాబ్వేకు యువ జట్టును, విండీస్‌కు మరో జట్టును ఎంపిక చేయడమనేది పూర్తిగా సెలక్షన్ కమిటీ నిర్ణయమే’ అని కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ స్పష్టం చేశారు. అయితే వన్డేలు, టి20లు రెగ్యులర్‌గా ఆడుతున్న కోహ్లి, రోహిత్, అశ్విన్, ధావన్‌లాంటి ఆటగాళ్లకు కాస్త బ్రేక్ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మరీ ఎక్కువగా క్రికెట్ ఆడని రైనా, యువరాజ్, జడేజా, భువనేశ్వర్‌లను ఎందుకు పక్కన పెట్టినట్లో! పైగా వరల్డ్ కప్ మొత్తం కూర్చున్నా ఒక్క మ్యాచ్ ఆడని హర్భజన్, నేగి, ఇంకా కెరీర్ ఆరంభ దశలోనే ఉన్న హార్దిక్ పాండ్యాలను కూడా తప్పించి సెలక్టర్లు ఏం చెప్పదల్చుకున్నారు? అటు విశ్రాంతి కాకుండా ఇటు వేటు వేయకుండా 17 మందిని పక్కన పెట్టడం నిజంగా  ఆశ్చ‌ర్య‌మే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →