Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

భారత రత్న, సంగీత విదుషీమణి మన ఎమ్మెస్ సుబ్బలక్ష్మి

By   /  September 18, 2016  /  No Comments

    Print       Email

14358835_1221835877868907_4681760931044654229_nఈరోజు భారత రత్న, సంగీత విదుషీమణి మన ఎమ్మెస్ సుబ్బలక్ష్మి అమ్మ శత జయంతి. ఆమె కోసం ఒక నాలుగు పద్యకుసుమాలు. ఆమె ఆశీస్సులు మనందరి మీదా అక్షతలై కురవాలి.

1. ఆ.వె
ఆమె గళమునందు ఆమని కొలువాయె,
మధుర భక్తి తా సుమధురమాయె;
పాట వినిన చాలు పరమాత్ముడే దిగి,
భువికి వచ్చు కాద, దివిని విడచి!

InCorpTaxAct
Suvidha

2. ఆ.వె
సుప్రభాతమనిన సుబ్బులక్ష్మిది కాదె,
మధుర యష్టకమ్ము మధువు గాను;
మీర భజన తనది మీటుగా హృదయమ్ము,
కర్కశులకు కూడ కరుణ కలుగ!

3 ఆ.వె.
అన్నమయ్య పదము ఆర్తి తోడను పాడు,
త్యాగరాయ కృతిని తన్మయముగ;
దీక్షితారు గీతి తేటగా పలికించు,
దేశభక్తి పాట దివ్యముగను!

4 ఆ.వె.
కోకిలమ్మ ఆమె కోటి భక్తులకిల,
కొలువు దీరె హృదుల కోమలముగ;
భారతి శిరమందు భాసిల్లె రతనమై,
అమ్మ మనకు తానె బమ్మ దార!

 

 

Author:

Nandoori Sundari Nagamani

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →