Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Mudragada and Kodandaram

By   /  June 10, 2016  /  Comments Off on Mudragada and Kodandaram

    Print       Email

mudragada-kodandaramఇక్క‌డ కోదండ‌రామ్‌.. అక్క‌డ ముద్ర‌గ‌డ‌

 

InCorpTaxAct
Suvidha

 

 

తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కె.చంద్ర‌శేక‌ర్‌రావుకు, చంద్ర‌బాబు నాయుడుకు  నిద్ర‌లేకుండా చేస్తున్నారు ఆ ఇద్ద‌రు.  మాటిమాటికి ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, వాగ్దానాల‌పై ఏకంగా ముఖ్య‌మంత్రుల‌ను టార్గెట్ చేస్తూ ప్ర‌భుత్వాల‌ను ఇరుకన పెడుతున్నారు. రెండు రాష్ట్రాల్లోని ముఖ్య‌మంత్రులు కూడా ప్ర‌తిప‌క్షాం లేకుండా చేయాల‌ని ప్ర‌య‌త్నం చేస్తుంటే ఆ ఇద్ద‌రు మాత్రం ప్ర‌భుత్వాల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. దీంతో ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు వాళ్ల‌ను ఏం చేయాలో తెలియ‌క త‌మ మంత్రుల‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. వివ‌రాల్లోకి వెళ్లితే.. కాపులను బీసీల్లో చేర్చాలని ఉద్యమిస్తూ ఏపీలో తెలుగుదేశం పార్టీ సర్కార్‌కు ముద్రగడ కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటే, తెలంగాణలో గత నాలుగైదు రోజుల వరకు ఏమి పట్టనట్లు వ్యవ హరించిన కోదండరామ్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విరు చుకుపడుతూ కేసీఆర్ కంట్లో నలుసు మాదిరిగా తయారయ్యారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌తో కలిసి భుజం, భుజం కలిపి ఉద్యమించిన కోదండరామ్, రెండేళ్ల ప్రభుత్వ పాలనపై తొలిసారిగా గత నాలుగురోజుల క్రితం జరిగిన ఒక సదస్సులో గళం విప్పారు. ప్రజా ఆకాంక్షల అనుగుణంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేయడం లేదని ఆయన నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వాల పంథానే కేసీఆర్ సర్కార్ అనుసరిస్తోందని విరుచుకుపడ్డారు. రెండేళ్లలో ఈ ప్రభుత్వం సాధించిందేమి లేదని తేల్చారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్యనేతలంత కోదండరామ్‌పై ముప్పేటదాడి దిగారు. కోదండను కాంగ్రెస్ ఏజెంటని తిట్టిపోశారు. అసలు కోదండరామ్ ఏవరని ప్రశ్నించారు. జేఏసీ ఎక్కడుందని నిలదీశారు. తెలంగాణ సాకారంతోనే జేఏసీ రద్దయిపోయిందని చెప్పారు. కోదండరామ్‌కు అంతగా రాజకీయాలు చేయాలనుంటే ఏదైనా పార్టీలో చేరాలని ఉచిత సలహానిచ్చారు. కోదండరామ్ కుబుసం విడిచిన విషనాగంటూ తిట్టిపోశారు. మంత్రుల విమర్శలతో కోదండరామ్ ఏమాత్రం వెరవలేదు… సరికదా ప్రభుత్వంపై తన విమర్శల పదను పెంచారు. మెదక్ జిల్లాలోని మల్లన్నసాగర్ భూనిర్వాసితులను కలుసుకున్న ఆయన ప్రభుత్వ విధానాలపై ఒంటికాలితో లేచారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని తేల్చిచెప్పారు.

కాపు నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కాపుల‌ను బీసీ జాబితాలో చేర్చాల‌ని ఏపీ స‌ర్కార్‌పై పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ సంద‌ర్భంగా కొన్ని నెల‌ల క్రితం తునిలో నిర్వ‌హించిన కాపు గ‌ర్జ‌న విజ‌య‌వంతంమైంది. అంతేకాదు కిర్లంపూడిలోని త‌న స్వ‌గృహంలో నిరవధిక దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ముద్రగడ దీక్షకు మద్దతుగా ఆయన అనుచరులు, కాపు కులస్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడంతో రాష్ట్రంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు ప్రభుత్వం చొరవ తీసుకుని ముద్రగడ చేత దీక్ష విరమింపచేయడంలో సక్సెసయింది. అయితే అదే సమయంలో తుని ఘటనతో సంబంధం లేని వార్ని ఎవర్ని అరెస్టు చేసేది లేదని ప్రభుత్వం తరుపున హాజరయిన మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. అయితే గత రెండు రోజులుగా తుని ఘటనకు బాధ్యులైన వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. తుని ఘటనతో సంబంధం లేని అమాయకులైన కాపులను కాపులను పోలీసులు అరెస్టు చేస్తున్నారని ముద్రగడ మండిపడుతున్నారు. ఏది ఎలా ఉన్నా ఇక్క‌డ కోదండ‌రామ్‌.. అక్క‌డ ముద్ర‌గ‌డ తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు కంటిలో న‌లుసులా త‌యార‌య్య‌ర‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →