Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Mudragada indefinite hunger strike from February 5

By   /  February 3, 2016  /  Comments Off on Mudragada indefinite hunger strike from February 5

    Print       Email

MUDRAGADA SCREEN SHOT

5 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా: ముద్రగడ పద్మనాభం

InCorpTaxAct
Suvidha

 

ఈనెల 5 నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించారు.ఒకవేళ తనను అరెస్ట్ చేస్తే.. జైలులో ఉండే ఆమరణ దీక్ష చేస్తానని అన్నారు.ప్రభుత్వం కాపులను బీసీల్లో చేర్చడంతో పాటు తక్షణం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.తనతో పాటు కాపు కార్యకర్తలపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని అన్నారు.తునిలో జరిగిన హింసాకాండకు ఏపీ సర్కారే బాధ్యత వహించాలని చెప్పారు.అసలు హింసాకాండకు ఏపీ సర్కారే రూపకల్పన చేసిందని ఆరోపణలు గుప్పించారు.తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని.. అయితే ప్రభుత్వం చర్యల కారణంగా బయటపెట్టలేకపోతున్నామని చెప్పారు.ఉద్యమానికి.. ఉద్యమకారులకు తాను అండగా ఉంటానని తేల్చి చెప్పారు.కనీసం ఒక్కరిని అరెస్ట్ చేసినా.. వంద మంది జైలుకు వెళ్ళేందుకు రెడీగా ఉన్నారని అన్నారు.

మరోవైపు.. తుని లో జరిగిన హింసాత్మక ఘటనలో ముద్రగడ పై రైల్వే శాఖ సెక్షన్ 163, 164 కింద మొత్తం 76 కేసులు నమోదు చేసింది. దీంతో ముద్రగడ.. తన రెండు గన్‌లను కిర్లంపూడి పోలీసులకు అప్పగించారు. లైసెన్స్ రివాల్వర్‌తో పాటు సింగల్ బ్యారల్ గన్ ను కూడా పోలీసులకు ఇచ్చేశారు. ఉద్దేశపూర్వకంగానే రైల్వే ట్రాక్ లపైకి వచ్చారని.. రైల్వే ఆస్తులను తగలబెట్టారంటూ ముద్రగడ పద్మనాభంపై కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →