ముద్రగడ దారి ఎటువైపు?
ఇప్పుడు చర్చంతా ముద్రగడ పద్మనాభంమీదే. ఆయన ఏ పార్టీలో చేరుతారనే. ఆయన వేరే పార్టీలో చేరుతారా? ఆయనే పార్టీ పెడతారా? అనే చర్చ కాపులతో పాటు మరి కొన్ని వర్గాల్లో నడుస్తోంది. తుని ఘటనలో అరెస్టు అయిన వారికి బెయిల్ మంజూరైన నేపథ్యంలో ముద్రగడ దీక్షకు ప్రయోజనం లేకుండా పోయిందన్న వాదనలు రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. మరోవైపు అన్ని పార్టీల మద్దతును ఆయన కూడగట్టినా ఆయన దీక్షకు మద్దతుగా ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ గానీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రోడ్డెక్కిన పరిస్థితి లేదు. కాపు ఉద్యమం తొలినాళ్లలో ఈ ఉద్యమానికి, ముద్రగడకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే రంగంలోకి దిగింది. కానీ తుని ఘటన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గతంలో మాధిరి దూకుడును కాపు రిజర్వేషన్ల విషయంలో ప్రదర్శించలేదు.
కేవలం ఏదో ఒక కాపు నేత నివాసంలో కాంగ్రెస్, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతలు సమావేశాలు నిర్వహించడం తప్పా ముద్రగడ దీక్షకు బలంగా మద్దతు పలికేలా ఈ పార్టీలు రోడ్డెక్కిన పరిస్థితి లేదు. దీంతో రాజకీయ పార్టీల మద్దతు ఆశించి రంగంలోకి దిగిన ముద్రగడ పద్మనాభకు కలిసొచ్చే ప్రయోజనమెంతా…? జరిగిన నష్టమెంతా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. కాపు రిజర్వేషన్ల ఉద్యమంతో రంగంలోకి దిగిన ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. ఇక ఇతర పార్టీలైనా ఆయన్ని అక్కునచేర్చుకొన్నాయా అంటే ఆ పరిస్థితి కనిపించడంలేదు అన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల నుంచి వినవస్తోంది. ఇలాంటి పరిస్థితి ముద్రగడ పదనాభం ఎటువైపు నడుస్తారోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.