Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Mudragada Padma Nabham

By   /  May 26, 2016  /  Comments Off on Mudragada Padma Nabham

    Print       Email

mudragadaద‌త్తాత్రేయ బాట‌లో ముద్ర‌గ‌డ‌

 

InCorpTaxAct
Suvidha

 

 

కేంద్ర మంత్రి ద‌త్తాత్రేయ అంటేనే గుర్తుకు వ‌చ్చేది ఆయ‌న లేఖ‌లు. ఏ చిన్న స‌మ‌స్య అయినా అధికార పార్టీకి త‌న లేఖ‌ల ద్వారా వివ‌రిస్తాడు. ఒక‌టి కాదు రెండు కాదు.. ఒకే స‌మ‌స్య‌పై వంద‌ల సార్లు లేఖ‌లు రాసిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాపు నాయ‌కుడు, మాజీ మంత్రి కూడా ద‌త్తాత్రేయ వార‌స‌త్వాన్ని అందుకుంటూ తాను కూడా అధికార పార్టీకి లేఖ‌లు రాయ‌డం మొద‌లు పెట్టారు. కాపుల సంక్షేమం.. నిధులు.. తదితర విషయాల్లో చంద్రబాబుకు ఇప్పటికే పలు లేఖలు రాసిన ముద్రగడ తాజాగా మరో లేఖ రాశారు. అందులో ఆయన తాను వైఎస్ జగన్ గైడెన్సులో నడుస్తున్నానన్న ఆరోపణలు తిప్పికొట్టారు. ‘‘చంద్రబాబుగారూ…. మీ ప్రత్యర్థి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వయసు నా రాజకీయ జీవితమంత లేదు. ఆయన నాకు సలహాలివ్వడమేంటి?’’ చంద్రబాబును ప్రశ్నిస్తూ ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను జగన్ పక్షమని కనుక రుజువు చేస్తే కాపు ఉద్యమం ఆపేస్తానని అదేకనుక నిరూపించలేకపోతే మీరు ఏం చేస్తారో చెప్పాలని ఆ లేఖలో ముద్రగడ ప్రశ్నించారు. ప‌నిలో పనిగా చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ప్రభుత్వ సొమ్ముతో కడుతున్న కాపు భవనాలకు ‘చంద్రన్న’ పేరు పెట్టాలని జీవోలు విడుదల చేసి ఇప్పుడు భుజాలెందుకు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. కాగా ఇటీవల ముద్రగడ కాపులు – ఎస్సీలు కలిసి రాజకీయ వేదిక ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. దీంతో ఆయన రాష్ట్రంలోని కాపు నేతలతో పాటు ఎస్సీ నేతలనూ కలుస్తున్నారు.  ఏదేమైనా త‌న లేఖల ద్వారా ముద్ర‌గ‌డ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెడుతున్నార‌న‌డంలో సందేహం లేదు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TAMA’s 10th Semiannual Chess Tournament

Read More →