Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Mudragada vows to fight for cause of Kapus

By   /  February 1, 2016  /  Comments Off on Mudragada vows to fight for cause of Kapus

    Print       Email

mudragada padmanabham newరిజర్వేషన్లు వచ్చే వరకు పోరాటం కొనసాగుతుంది: ముద్రగడ పద్మనాభం
తాను, తన జాతి అమ్ముడుపోయామని టీడీపీ నేతలు ఆరోపించడం బాధ కలిగించిందని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. పేదరికం నుంచి బయటపడేందుకు తమ జాతి ఉద్యమ బాట పట్టిందని అన్నారు.తమ ఉద్యం ఏ కులానికి, మతానికి వ్యతిరేకం కాదన్నారు.కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ఎన్నో ఏళ్ళుగా జాప్యం జరుగుతోందని అన్నారు.ఇది మంచిది కాదన్నదే తమ ఉద్దేశ్యమని తెలిపారు.

 

InCorpTaxAct
Suvidha

కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ఆశపెట్టి అవమానాలకు గురి చేయడం వల్లే రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.రిజర్వేషన్లు కల్పించే వరకు తన జీవితాన్ని కాపు జాతికి అంకితం చేస్తున్నట్లు ముద్రగడ పద్మనాభం ప్రకటించారు.కాపులను బీసీల్లో చేరుస్తామంటూ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని ఆయన గుర్తు చేశారు.దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు.ఉద్యమానికి తాను పూర్తి బాధ్యత వహిస్తున్నానని అన్నారు.తనను జైల్లో పెట్టినా కూడా పోరాటం కొనసాగిస్తామన్నారు.జైల్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు.తన దీక్ష వల్ల ఎవరూ భయపడవద్దని కోరారు.రిజర్వేషన్లు వచ్చే వరకు తమ పోరాటం ఆగదని చెప్పారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →