Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Mudragada

By   /  April 18, 2016  /  Comments Off on Mudragada

    Print       Email

mudragadaకాపులేమైనా పాకిస్థానీయులా?

 

InCorpTaxAct
Suvidha

 

 

తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కాపుల‌ను పాకిస్థానీయులుగా చూస్తోంద‌ని కాపు వ‌ర్గం నేత‌, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం తీవ్ర‌స్థాయి వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల ముందు ఒక‌మాట‌.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మ‌రొక‌మాట మాట్లాడ‌డం స‌రికాద‌ని టీడీపీ ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. అనంత‌పురంలో కాపు సంఘాల‌తో స‌మావేశ‌మైన ముద్ర‌గ‌డ పైవిధంగా స్పందించారు. కాపుల‌ను బీసీల్లో చేర్చుతామ‌ని ఇచ్చిన హామీని నేటికీ నేర‌వేర్చ‌క‌పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. బ్రిటీష్ హ‌యాంలోనే కాపుల‌ను బీసీల్లో చేర్చాల‌ని చెబితే, ఇప్ప‌టి ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్యం చేస్తూ వ‌చ్చార‌న్నారు. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబునాయుడు పున‌రాలోచించి కాపుల‌ను బీసీల్లో చేర్చాల‌ని డిమాండ్ చేస్తున్నారు. తుని ఘ‌ట‌న‌లో కాపుల‌ను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నార‌ని, దీనిపై ప్ర‌భుత్వం జోక్యం చేసుకోవాల‌ని సూచించారు.

జ‌గ‌న్‌కు ఆ స్థాయి లేదు

వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం తీవ్ర‌స్థాయి వ్యాఖ్య‌లుచేశారు. కాపుల ఉద్య‌మం గురించి గానీ, కాపుల సంక్షేమం గురించి కానీ తాను స‌ల‌హాలు తీసుకునేంత స్థాయి వైయ‌స్ జ‌గ‌న్ లేద‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే తాను చేసే ఉద్య‌మాల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని వైయ‌స్ జ‌గ‌న్‌ను కానీ,ప్ర‌ముఖ హీరో, జ‌న‌సేత అధినేత ప‌వ‌న్ క‌ల్యాన్ కానీ కోర‌లేద‌న్నారు. జూన్ త‌ర్వాత మ‌ళి ద‌శ ఉద్య‌మం ప్రారంభం అవుతుంద‌ని, అప్ప‌టి వ‌ర‌కు కాపు సంఘాల నాయ‌కులు ఓపిక ప‌ట్టి ఉండాల‌ని పిలుపునిచ్చారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →