ప్రధాని మోదీపై ముఖేష్ అంబానీ ప్రశంసలు..
భారత ప్రధాని నరేంద్ర మోదీపై రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ప్రశంసలు కురిపించారు. మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అవినీతిని అరికట్టడానికేనని అన్నారు. ఇక దేశంలో క్యాష్ లెస్ లావాదేవీలు ప్రోత్సహిస్తున్నారని ప్రశంసించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న మోదీకి ధన్యావాలు అని అన్నారు. దేశాన్ని నగదు వినియోగం నుంచి నగదు రహిత లావాదేవీల దిశగా నడిపించి పెద్ద ముందడుగు వేశారని అన్నారు. దీనివల్ల మొత్తం నగదు అంతా ఉత్పాదకతకు ఉపయోగపడేవిధంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
త్వరలో ఆధార్ కార్డు గుర్తింపుతో బ్యాంకు రుణాలు మంజూరు అయ్యే పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. మోదీ నిర్ణయాన్ని గ్రామీణ ప్రజలు అర్ధం చేసుకున్నారని అన్నారు. అలాగే ప్రపంచం నడుస్తున్న తీరును, టెక్నాలజీని అర్ధం చేసుకునే వ్యక్తి ప్రధాని కావడం అందరి అదృష్టమని అన్నారు. మోదీ ఒబామాతో మీటింగ్ లో టెక్నాలజీ పేదలకు ఎలా ఉపయోగపడుతుంది అనే అంశంపై చర్చించడం తనను ఆకర్షించిందని ప్రశంసించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.