ఆకాశ్ అంబానీ..శ్లోకా నిశ్చితార్థం పూర్తి.. ఇక పెళ్లి బాజాలే
* డిసెంబర్లో వివాహానికి ఏర్పాట్లు
డెక్కన్ అబ్రాడ్: తన కార్పొరేట్ సామ్రాజ్యంతో దేశాన్ని శాసించగలుగుతున్న ముకేశ్ అంబానీ తన కుమారుడిని ఒక ఇంటివాడిని చేస్తున్నారు. వజ్రాల వ్యాపారి – రోజీ బ్లూ డైమండ్స్ అధిపతి రసెల్ మెహతా చిన్న కుమార్తె శ్లోకతో ఆకాశం వివాహం చేయడానికి అంబానీ ఫ్యామిలీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆయన తనయుడి నిశ్చితార్థం జరిగింది. ఆకాశ్ అంబానీ శ్లోకా మెహతాల ఎంగేజ్మెంట్ గోవాలో అత్యంత వైభవంగా సన్నిహితుల మధ్య ఈ వేడుకను నిర్వహించారు. నిశ్చితార్థ వేడుకలో అంబానీ తనకు కాబోయే కోడలికి స్వీట్ తినిపిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. డిసెంబర్ నెలలో వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు ఆకాశ్ శ్లోకా మెహతాలు చిన్ననాటి మిత్రులు.
ధీరుబాయ్ అంబానీ స్కూల్లో ఇద్దరు కలిసే చదువుకున్నారు. ఆకాశ్శ్లోకా వివాహం చేసుకోబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. శ్లోకా ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల కంపెనీ రోజీ బ్లూ డైమాండ్స్ సంస్థ అధినేత రసెల్ మెహతా కూతురు. శ్లోక లండన్‌లోని ప్రిన్స్టన్ యూనివర్సిటీ ఎకనామిక్స్‌లో పట్టా పొందారు. ప్రస్తుతం తమ డైమండ్ కంపెనీలో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె కనెక్ట్‌ఫర్ అనే సంస్థ సహ వ్యవస్థాపకురాలు. ఆకాశ్ రిలయెన్స్ రిటైల్ జియోలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.