Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Mumbai Indians vs Delhi DareDevils

By   /  April 14, 2018  /  Comments Off on Mumbai Indians vs Delhi DareDevils

    Print       Email

గెలుపెవ‌రిదో?

Suvidha
Biryani Pot

 

 

 

నేడు ఢిల్లీ, ముంబైల కీల‌క పోరు

* నిరాశ‌ప‌రుస్తున్న కెప్టెన్లు

* రానించ‌ని రోహిత్‌శ‌ర్మ‌, గౌత‌మ్ గంబీర్లు

* ఇరు జ‌ట్ల‌ల్లో మార్పులు చేసే అవ‌కాశం

* రెండు జ‌ట్ల‌కు కీల‌కం కానున్న గెలుపు

డెక్క‌న్ అబ్రాడ్‌: ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్లు ఐపీఎల్-11లో తొలి విజయం కోసం తహతహలాడు తున్నాయి. శనివారం జరిగే మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. తొలి రెండు మ్యాచ్‌ల్లో ముంబై జట్టు చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల చేతిలో ఒక్క వికెట్ తేడాతో ఓటమిపాలు కాగా.. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు కింగ్స్ లెవెన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ చేతిలో పరాజయం పాలైంది. ముంబై బ్యాటింగ్ లైనప్‌కు బలంగా భావిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ, వెస్టిండి యన్లు ఎల్విన్ లూయిస్, కీరాన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్ తొలి రెండు మ్యాచ్‌ల్లో పూర్తిగా విఫలమయ్యారు. రెండు మ్యాచ్‌ల్లో తక్కువ పరుగులకే వెనుదిరిగిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లోనైనా బాగా ఆడాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం ముంబై జట్టుకు చాలా అవసరం. లూయిస్ కూడా సత్తా చాటాలి. ఈ ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్నివ్వడంలో విఫలమవు తున్నారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో భారీ భాగస్వామ్యాలు చేయడంలో ముంబై విఫలమైంది.

ఇక బౌలర్ల విషయానికొస్తే మయాంక్ మార్కండే తొలి రెండు మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించాడు. మొత్తం ఏడు వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను అందుకున్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన స్వల్ప స్కోరు మ్యాచ్‌లోనూ అతను నాలుగు వికెట్లు తీశాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ డెత్ బౌలర్లుగా పేరొందిన ముస్తాఫిజుర్, బుమ్రా పరుగులు ఎక్కువగా సమర్పించుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో జట్టు కూర్పును మార్చే అవకాశముంది. నిరాశ పరుస్తున్న వారి స్థానంలో ముంబై జట్టు కొత్త వారికి అవకాశమివ్వనుంది. ముంబై బలమైన బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బ తీయాలంటే ఎక్కువగా పరుగులు సమర్పించుకుంటున్న ఢిల్లీ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేయాలి. స్పిన్నర్లు ముఖ్యంగా లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కీలక పాత్ర పోషించాలి. ఈ మ్యాచ్ సాయంత్రం జరగనుండడంతో మంచు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు.

ఐపీఎల్‌లో నేడు

ముంబై ఇండియన్స్ X ఢిల్లీ డేర్ డెవిల్స్

వాంఖడే స్టేడియం, ముంబై, సాయంత్రం 4 గంటల నుంచి…

కోల్‌కతా నైట్ రైడర్స్ X సన్‌రైజర్స్ హైదరాబాద్

ఈడెన్ గార్డెన్ స్టేడియం, కోల్‌కతా, రాత్రి 8 గంటల నుంచి…

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Sankaranethralaya fundraiser event ksheera Saagara Madhanam is a grand success!!

Read More →