ముస్లీం-గిరిజన – బీసీ ఈ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం..
ముస్లీం-గిరిజన – బీసీ ఈ రిజర్వేషన్ల బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం లభించింది. ఈ మేరకు ఆదివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలువురు నేతలు బిల్లుపై తమ స్పందనను తెలియజేశారు. అధికార పక్షం సభ్యులు బిల్లును సమర్ధించారు. అలాగే విపక్ష సభ్యులు బిల్లుపై విమర్శలు చేశారు. ఆ తర్వాత గిరిజనులకు 6 నుంచి పది శాతం రిజర్వేషన్లు, బీసీ ఈ లకు 4 నుంచి 12 శాతం రిజర్వేషన్ల బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.
బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. గిరిజనులు రిజర్వుషన్ల పెంపు రాజ్యాంగం కల్పించిన హక్కు అని స్పష్టం చేశారు. మతం పిచ్చిలో ఉండి ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వొద్దనడం కరెక్ట్ కాదని అన్నారు. ముస్లీంలు ఈ దేశంలో ప్రజలు కారా అంటూ ప్రశ్నించారు. వారు కూడా ప్రభుత్వానికి పన్నులు కడుతున్నారని అన్నారు. పేదరికం ఉన్నప్పుడు రిజర్వేషన్ల కోసం పోరాటం చేయడం సహజమేనని అభిప్రాయపడ్డారు. బ్రిటీషర్ల కాలం నుంచి రిజర్వేషన్లు ఉన్నాయని అన్నారు. భాగ్యరెడ్డి వర్మ మొట్టమొదటిసారిగా దళితుల రిజర్వేషన్ల గురించి ప్రస్తావించారని అన్నారు. అప్పట్లో నిజాంను ఒప్పించి భాగ్యరెడ్డి వర్మ దళితులకు రిజర్వేషన్లు సాధించారని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.