ఇద్దరం కష్టపడి పైకి వచ్చాం
జీవితంలో కష్టపడి ఎదగాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అబ్దుల్ కలాం, నరేంద్రమోడీనే ఇందు కు ఉదాహరణ అని ఆయన అన్నారు. తాను, చంద్రబాబు కష్టపడి పైకొచ్చా మని వెంకయ్యనాయుడు తెలిపారు. రాజస్థాన్ నుంచి రాజ్య సభకు ఎన్నికైన తర్వాత తొలిసారిగా వెంకయ్య నాయుడు మొదటిసారి విజయవాడకు వచ్చిన వెంకయ్య నాయుడు మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని అమరావతిని స్మార్ట్ సిటీల జాబితాలో చేరుస్తామన్నారు. రానున్న రోజుల్లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరి బాబు మాట్లాడుతూ పోలవరం అథారటీ ద్వారానే ప్రాజెక్ట్ పనులు చేపడతామన్నారు. ఏ రాష్ట్రానికీ ఇవ్వనంత సాయం ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం ఇస్తుం దని హరిబాబు చెప్పారు. ప్రపంచం ఆర్థిక మందగ మనంలో ఉన్నా భారతదేశం మాత్రం అభివృద్ధి చెందుతోందని వెంకయ్యనాయుడు అన్నారు.
దేశఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ గాడిలో పెట్టారని పేర్కొన్నారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో గురువారం పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ యూరియా కొరత లేకుండా మోడీ ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కిలో బియ్యంపై కేంద్రం రూ.27 సబ్సిడీ ఇస్తోందని వెంకయ్య చెప్పారు. ప్రతి విషయంపై మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారని వెంకయ్య వివరించారు. గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర మంత్రి వెం కయ్యకు మంత్రులు కామినేని, మాణిక్యాలరావు, బీజేపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గన్నవరం నుంచి విజయవాడ వరకు భారీ ర్యాలీ జరి పారు. నాలు గోసారి ఎంపీ అయ్యాక తొలిసారి విజ యవాడకు వెంకయ్య వచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వెంకయ్యకు సాదరస్వాగతం పలికారు. ఎంపీలు హరి బాబు, గోకరాజు, మంత్రులు కామినేని, మాణిక్యాలరావు ఏపీలో బీజేపీ స్థితిగ తులపై వెంకయ్య చర్చలు జరిపారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.