అదే నిజమైంది
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తో విభేదించిన మాజీ మంత్రి మైసూరారెడ్డి ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జగన్ తీరును విమర్శిస్తూ ఆయన అప్పట్లో లేఖ రాశారు. అయితే.. మైసూరా వైసీపీకి రాజీనామా చేయడానికి కారణం ఆయన సిమెంటు ఫ్యాక్టరీ వ్యవహారమేనని వైసీపీ వర్గాలు అప్పుడే ఆరోపించాయి. మైసూరారెడ్డి రాజీనామా చేయడానికి కుమారుడి సిమెంట్స్ ఫ్యాక్టరీ భూముల వ్యవహరమే కారణమని అప్పట్లో పెద్దెత్తున విమర్శలు వచ్చాయి. వైసీసీలో ఉంటే భూములు ఇచ్చే ప్రసక్తే లేదని టీడీపీ పెద్దలు స్పష్టం చేయడ వల్లే మైసూరారెడ్డి రాజీనామా చేశారని అప్పట్లో వార్తాలు వచ్చాయి. ఇప్పుడు అదే నిజమైంది. వైసీపీని వీడిన ఆయన ఇంకా టీడీపీలో చేరకపోయినా టీడీపీ నుంచి మాత్రం బాగానే లాభం చేకూరింది. సీఎం చంద్రబాబు ఆయనపై కరుణ చూపారు.
మైసూరా కుమారుడికి చెందిన సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు కేటాయించారు. ఇందుకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర కూడా వేసింది. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం నిడుజువ్విలో 140 ఎకరాల భూమిని మైసూరా కుమారుడి సిమెంటు ఫ్యాక్టరీకి ఏపీ ప్రభుత్వం కేటాయించింది. ఆ ప్రాంతంలో ఉన్న విలువ ప్రకారం ఎకరం రూ.2.4 లక్షల చొప్పున భూమిని తేజ సిమెంట్స్ కు అప్పగించనున్నారు. కాగా మైసూరారెడ్డి కుమారుడికి చెందిన సిమెంట్ ఫ్యాక్టరీకి ఏపీ ప్రభుత్వం భూములు ఇవ్వడంతో వైసీపీ ఆరోపణలకు నిజమేనన్నట్లు తేలింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.