Loading...
You are here:  Home  >  Movies  >  Bollywood  >  Current Article

Nagachaitanya’s marriage

By   /  June 20, 2016  /  Comments Off on Nagachaitanya’s marriage

    Print       Email

nagachaitanyaనాగ‌చైత‌న్య పెళ్లికి ఆమె ఓకే చెప్పేసింది

 

InCorpTaxAct
Suvidha

 

 

హీరో అక్కినేని నాగ‌చైత‌న్య‌, హీరోయిన్ స‌మంత‌ల ప్రేమ‌.. పెళ్లి వ్య‌వ‌హారం అంద‌రికీ తెలిసిందే. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి పెద్ద‌గా స‌మ‌స్య‌లు లేవ‌నే చెప్పాలి. అయితే ఏవైనా చిన్న‌చిన్న‌వి ఉన్నా వాటిని నాగ‌చైత‌న్య ప‌రిష్క‌రించుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే చైత‌న్య త‌ల్లి ల‌క్ష్మి కూడా  కొడుకు పెళ్లికి పచ్చ జెండా ఊపేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఆమె చెన్నైకి వచ్చి సమంతతో ఒక రోజంతా గడిపినట్లుగా టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  తనకు కాబోయే అత్తగారి దగ్గర సమంత బాగానే మార్కులు కొట్టేసినట్లు చెబుతున్నారు. ఈ ఏడాది ఆఖర్లో కానీ.. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో కానీ.. చైతూ-సమంత పెళ్లి పీటలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అంతేకాదు స్వయంగా నాగార్జునే తన కోస్టార్ అయిన అమలను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నాగచైతన్య విషయంలో అతను అభ్యంతర పెట్టే పరిస్థితి లేదు. మరోవైపు రామానాయుడు ఫ్యామిలీలో కూడా దదాపుగా అందరూ ఓకే చెప్పేశారు. కాగా గత నెల ‘బ్రహ్మోత్సవం’ ప్రమోషన్లలో భాగంగా ఓ టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉన్నానంటూ సమంత కొన్ని హింట్లివ్వడం.. ఆ హింట్లతో ఇండస్ట్రీ జనాలందరూ చైతూనే ఆ హీరో అన్న అంచనాకు వచ్చేయడం తెలిసిందే. ఐతే చైతూ మాత్రం ఈ వ్యవహారంపై ఇప్పటిదాకా పెదవి విప్పక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →