నాగ్ క్యారెక్టర్ సినిమాకి హైలెట్: వంశీ పైడిపల్లి
స్టార్ హీరోల సినిమాలు అంటే పాటలు , ఫైట్లు కామన్. అయితే కింగ్ నాగార్జున మాత్రం తన సినిమాల విషయంలో కథకే ఇంపార్టెన్స్ ఇస్తూంటారు. ఇమేజ్, హీరోయిజం అన్న విషయాలను పట్టించుకోకుండా ప్రేక్షకులకి వినోదాలు పంచాలనే భావిస్తారు. అందుకే ఆయన కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాలెన్నో కనిపిస్తాయి. ఆయన చేసిన పాత్రలు కొత్త తరం హీరోలకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. తన తనయులు హీరోలుగా తెరపైకి వచ్చాక కథల ఎంపికలో నాగార్జున ఆలోచనలు మరింతగా మారిపోయాయి. ప్రయోగాలకి సైతం ఆయన రెడీ అంటున్నారు. అందులో భాగంగా చేసిన చిత్రమే ‘ఊపిరి’. ఈ సినిమాలో నాగ్ కేవలం వీల్ ఛైర్ కి పరిమితమయ్యారు. ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయిన నాగార్జున కేవలం వీల్ ఛైర్ కు పరిమితమయ్యే పాత్రలో నటించడమంటే విశేషమే. అయితే అలా కూర్చునే నాగ్ బోలెడన్ని వినోదాలు పంచుతారని మూవీ యూనిట్ చెబుతోంది.
కార్తీ, తమన్నాలతో కలిసి నాగార్జున నటించిన మూవీ ‘ఊపిరి’. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని పీవీపీ సంస్థ నిర్మిస్తోంది.ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇటీవల ప్రచార చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. స్నేహమే ప్రాణంగా భావించే ఇద్దరు వ్యక్తుల కథ ఇది. ఫ్రెంచిలో విజయవంతమైన ‘ది ఇన్‌టచబుల్స్’ ఆధారంగా రూపొందించామన్నారు. సినిమా మొత్తం వినోదాత్మకంగా సాగుతుందన్నారు. ఈ చిత్రంలో నాగ్ నటన, ఆయన పాత్ర ప్రేక్షకుల్ని అలరిస్తుందన్నారు.ఈ చిత్రానికి సంగీతం:,గోపీసుందర్.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.