Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Nagarjuna in Majnu movie?

By   /  February 7, 2016  /  Comments Off on Nagarjuna in Majnu movie?

    Print       Email

majnu

చైతూ సినిమాలో నాగార్జున..!

InCorpTaxAct
Suvidha

మలయాళం మూవీ ‘ప్రేమమ్’ ని టాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ‘మజ్ను’ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోగా నాగ చైతన్య నటిస్తున్నారు. ఆయన సరసన శృతి హాసన్ కనిపించనున్నారు. అలాగే అనుపమ పరమేశ్వరన్-మడోనా సెబాస్టియన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో నటించేందుకు నాగార్జున తన కాల్షీట్ ని కేటాయించారని సమాచారం .చైతు-నాగ్ కలిసి నటించడం ఫస్ట్ టైమ్ మాత్రం కాదు. ఇప్పటికే నాగ్ ‘మనం’ మూవీతో పాటు ‘అఖిల్’ సినిమాలోనూ కనిపించి అభిమానులకు కనువిందు చేశారు. అయితే ‘మజ్ను’ లో నాగ్ క్యారెక్టర్ కి చాలా హై ఇంపార్టెన్స్ ఉందట. ఆయన చేయబోయే పాత్ర సినిమాకి చాలా కీలకమని తెలుస్తోంది. అందుకే నాగార్జున కూడా సినిమాలో చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారని సమాచారం. అంతేకాదు.. ఈ సినిమా చైతూ కేరీర్ కి ఎంతో ముఖ్యమైనది. దీంతో తండ్రీ తనయులు చాలా జాగ్రత్తగా సినిమా వచ్చేటట్లు కష్టపడు తున్నారని సమాచారం.

ఈ మూవీని కార్తికేయ ఫేమ్ చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నారు.ఈ చిత్రం ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ లో ఉందని సమాచారం. సమ్మర్ బరిలో చిత్రాన్ని నిలిపేందుకు మూవీ యూనిట్ కసరత్తు చేస్తోంది. ఇక నాగ చైతన్య.. ఈ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నారట. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్స్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →