Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Nagarjuna romance with Anushka

By   /  February 27, 2018  /  Comments Off on Nagarjuna romance with Anushka

    Print       Email

నాగార్జున అనుష్క మరోసారి..!

 

InCorpTaxAct
Suvidha

 

 

సూపర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బెంగళూరు భామ అనుష్క టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించింది. కేవలం కమర్షియల్ సినిమాలే కాదు కేవలం తనకు మాత్రమే సాధ్యమయ్యే సినిమాలను చేస్తూ వచ్చింది. ఈమధ్యనే భాగమతితో బంపర్ హిట్ అందుకున్న అనుష్క ఇప్పుడు నాగార్జున సరసన నటించేందుకు రెడీ అయ్యిందట.

కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ లో నాగ్ జోడిగా అనుష్క నటిస్తుందట. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా లో నానానికి జోడిగా కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్ సెలెక్ట్ అయ్యిందట. నాగ్ డాన్ గా, నాని డాక్టర్ గా కనిపించబోయే ఈ సినిమా ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందట. ప్రియాంకా దత్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →