‘వంగవీటి’లో గంగూలి..
రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే.. ప్రకటన దగ్గర నుంచి రిలీజ్ అయ్యేవరకు..ప్రేక్షకులు ఆశక్తిగా ఎదురుచూస్తారు. అలాగే వర్మ తీయబోయే సినిమా అప్ డేట్స్ విషయంలో కూడా ఆశక్తి కనబరుస్తారు. రీసెంట్ గా ఆయన ‘వంగవీటి’ మూవీ గురించి ప్రకటించారు. వంగవీటి రంగా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం కాబట్టి.. ఆటోమేటిక్ గా ఈ మూవీ గురించి జనం చర్చించుకోవడం మొదలుపెట్టేశారు.
నిజ జీవితాల ఆధారంగా సినిమాలు తెరకెక్కించే వర్మ ఆ పాత్రలకు న్యాయం చేయగలిగే నటీ నటులను ఎంపిక చేసుకుంటారు. ఆ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటారని చాలాసార్లు ప్రూవ్ అయింది. ఇప్పటికే రాధా, రంగ పాత్రదారులను ఎంపిక చేసి ప్రేక్షకులకు పరిచయం చేశారు. తాజాగా ఈ సినిమాలో మరో కీలక పాత్రను పరిచయం చేశారు వర్మ. వంగవీటి రత్న కుమారి పాత్ర కోసం నటి నైనా గంగూలీని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ‘ వంగవీటి రంగా గారిని చంపిన తర్వాతే.. వంగవీటి రత్నకుమారిగారు వెలుగులోకి వచ్చారు.. కానీ ఆ హత్య జరగక ముందు నాకు తెలిసిన రత్నకుమారిగారి జీవితంలో ఆవిడ అనుభవించిన భావోద్వేగాలను అభినయించగలిగే నటి కోసం నేను చాలా చాలా అన్వేషించాను.. చివరికి ఆ కెపాసిటీ నాకు నైనా గంగూలీలో కనిపించింది’ అని వర్మ పేర్కొన్నారు. ‘వంగవీటి’ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న వర్మ.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్స్, టీజర్‌తో భారీ అంచనాలు పెంచుతున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.