Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Nani launches ‘Pichiga Nachav’ Telugu Movie First Look

By   /  August 21, 2016  /  Comments Off on Nani launches ‘Pichiga Nachav’ Telugu Movie First Look

    Print       Email

pichiga nachav telugu movie 2ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీగా ‘పిచ్చిగా నచ్చావ్’..!

 

InCorpTaxAct
Suvidha

 

 

”ప్రేమన్నది విశ్వవ్యాప్తం. అందులో ఉన్న ప్రతి మనిషి ప్రేమ గురించి తనదైన శైలిలో నిర్వచనం చెబుతూంటారు. అంటే ప్రేమ వ్యక్తిగతమైనది కూడా అన్నమాట. కొందరు యువత చిన్న విషయాలను కూడా అర్ధం చేసుకోరు. అలాంటివారు కోపం, ఈర్ష్య, ద్వేషం పెంచుకుంటారు. దీనివల్ల మనసులు విడిపోతాయి. అలాంటి అయోమయంలో పడిన ఓ యువకుడు ప్రేమ గురించి నిర్వచనం తెలుసుకుంటాడు. తన వల్ల జరిగిన ఓ పొరబాటును సరిదిద్దకుంటాడు. తన జీవితాన్ని అందగా మలచుకుంటాడు. అది ఎలా అన్నది తెరపైనే చూడాలని చెబుతున్నారు నిర్మాత పెండెం కమల్ కుమార్.సంజయ్, చేతన ఉత్తేజ్, నందు, కారుణ్య ప్రధాన పాత్రల్లో శ్రీవత్స క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం ‘పిచ్చిగా నచ్చావ్’. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని హీరో నాని విడుదల చేశారు.

వి.శశిభూషణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి పెండెం కమల్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. కథ ఎంటన్నది తెలియకుండా ఫస్ట్ లుక్ ప్లాన్ చేశామన్నారు. సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూసేటువంటి ఉత్తమ ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నామన్నారు. తమ తొలి సినిమాకే మంచి టీమ్ దొరికిందన్నారు. దర్శకుడు చెప్పింది చెప్పినట్లుగా చిత్రీకరించారని తెలిపారు. త్వరలో ప్రచార చిత్రాలను, సాంగ్స్ విడుదల చేస్తామన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: వెంకట హనుమ, సంగీతం: రాం నారాయణ, ఆర్ట్: రమేష్, ప్రొడక్షన్ డిజైనర్: పుచ్చా రామకృష్ణ, సమర్పణ: శ్రీమతి శైలజ.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →