Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Nannapaneni Raja Kumari asked CM KCR to increase RTC buses to AP

By   /  January 12, 2018  /  Comments Off on Nannapaneni Raja Kumari asked CM KCR to increase RTC buses to AP

    Print       Email

సీఎం కేసీఆర్ ప్రత్యేక బస్సులపై విజ్ఞప్తి చేసిన నన్నపునేని రాజకుమారి

 

Suvidha
Biryani Pot

 

సంక్రాంతి అంటే అందరూ సొంత ఊళ్లకు వెళ్తూంటారు. దీంతో రోడ్డు రవాణా సంస్థను ఆశ్రయించడం సహజంగా జరగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి తెలంగాణ సీఎం కేసీఆర్ కి ఓ విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు అధిక సంఖ్యలో బస్సులను నడిపించాలని కోరారు. ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలకు సౌకర్యవంతంగా ఉండేలా చూడాలని విన్నవించారు.

గుంటూరులోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో జరిగిన సంక్రాంతి సంబరాలు, ‘మా ఊరు’ అవార్డుల ప్రదానోత్సవంలో నన్నపనేని రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్‌కు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. మూడు రోజులపాటు ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని అన్నారు. అందువల్ల హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆంధ్రా వాసులు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో బస్సులను నడపాలని ఆమె అన్నారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Anasuya reveals her marriage secret

Read More →