Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Nara Lokesh to be inducted into Cabinet?

By   /  March 26, 2016  /  Comments Off on Nara Lokesh to be inducted into Cabinet?

    Print       Email

chandra babu with lokesh

ఏపీ మంత్రివర్గంలోకి చినబాబు..?

InCorpTaxAct
Suvidha

 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ ఏపీ క్యాబినేట్ లో చేరనున్నారా..? త్వరలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు ఛాన్స్ ఇవ్వనున్నారా..? అంటే టీడీపీ శ్రేణుల నుంచి అవుననే అవుననే చెబుతున్నాయి.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్.. ఇప్పటికే పార్టీలో మంచి పదవిలో ఉన్నారు. టీడీపీ జాతీయ కార్యదర్శిగా అత్యున్నత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే మొన్నటి వరకు లోకేష్ ను రాజ్య సభకు పంపుతారంటూ పార్టీ వర్గాల్లో ముమ్మర ప్రచారం సాగింది. ఎంపీగా పంపిస్తే జాతీయ స్థాయిలో పరిచయాలు ఉంటాయని చంద్రబాబు భావించారని ముమ్మర ప్రచారం జరిగింది. అయితే ఏపీ రాజకీయాల్లో ఉంటేనే లోకేశ్ భవిష్యత్తు బంగారంలా ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారంటూ.. ప్రస్తుతం పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏపీ క్యాబినేట్ లోకి చినబాబుకు చోటు కల్పించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారని కూడా ప్రచారం జరగుతోంది.

ఏపీపాలనలో చినబాబు జోక్యం..?

టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర పరిపాలనా వ్యవహారాల్లో లోకేష్ జోక్యం చేసుకుంటున్నారేది బహిరంగ రహస్యం. చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు లోకేష్ తో టచ్ లో ఉంటున్నారు. అయితే కొందరు నేతలు.. లోకేష్ ను రాజ్యసభకు ఎంపిక చేసి కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించాలని చంద్రబాబుకు సలహా ఇచ్చారంటున్నారు. అయితే జాతీయ స్థాయిలో కంటే రాష్ట్రస్థాయిలో ఉంటేనే లోకేశ్ భవిష్యత్తు బాగుంటుందని చంద్రబాబు భావిస్తున్నారట. ఒకవేళ లోకేష్ కు రాజ్యసభ సీటు ఇస్తే పార్టీ నుంచి కూడా వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని భావిస్తున్నట్లుగా సమాచారం.

రాబోయే ఆరు నెలల్లో లోకేష్ కు ఎమ్మెల్సీ పదవి..?

చినబాబు ఇప్పటివరకు డైరెక్ట్ గా ఎన్నికల్లో పాల్గొనలేదు. ఇక ఆయన ఎమ్మెల్యే కూడా కాదు. అందుకే ఆయన్ను నేరుగా మంత్రివర్గంలోకి తీసుకుని.. రాబోయే ఆరు నెలల్లో ఎమ్మెల్సీ చేయడానికి చంద్రబాబు స్కెచ్ రెడీ చేశారని టీడీపీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. లోకేష్ కు ఐటీ, కమ్యూనికేషన్ల శాఖను అప్పగిస్తే బాగుంటుందని టీడీపీ అధినేత ఆలోచనగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలా అయితే లోకేష్ యువతకు దగ్గర అవుతారని భావిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా దూసుుకుపోతున్నారు. ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంలో సక్సెస్ అవుతున్నారు. అలాగే మంచి పనితీరు కనబర్చుతున్నట్లుగా ఆయనకు మంచి పేరు కూడా ఉంది. ఆయనకు లాగానే లోకేష్ ను కూడా ఐటీ మంత్రిగా తీసుకుంటే.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కుమారులు ఒకే శాఖను చూసినట్లుగా ఉంటుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయట. వచ్చే జూన్ లో జరిగే మంత్రివర్గ విస్తరణలో లోకేష్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని ముమ్మర ప్రచారం సాగుతోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →